తెలుగు

ధ్యానం 357: కృప ప్రేరణలు

పీటర్ ఆర్ట్సెన్, సార్వజనిక స్వామ్యం, వికీమీడియా కామన్స్ ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

ఎవరైనా కలతతో ఉన్నప్పుడు, మీరు వారికి దూరంగా ఉండవచ్చు.  వారితో మాట్లాడితే మీ సమయంపైనా శక్తిపైనా పెద్ద భారం పడుతుందని అనుకోవడం సులభమే.  కానీ మీ సంభాషణను నడిపించేది ప్రభువే అయితే, ఆయన కొద్దిసేపటిలోనే అద్భుతమైన కార్యాలు చేయగలడు.  నిజమే, ప్రేమ కొన్నిసార్లు ఎన్నో గంటల పాటు శ్రద్ధ వహించాలని కోరుతుంది. అయితే తరచుగా కొన్ని మాటలు, శ్రద్ధగా వినడం లేదా ఒక మృదువైన చిరునవ్వు అవసరంలో ఉన్న వ్యక్తికి మీరు ఊహించగలిగిన దానికంటే ఎంతో ఎక్కువ మేలు చేస్తాయి (చూడండి: డైరీ #1736).

మీ వైపు నుండి చాలా కొద్దిపాటి ప్రయత్నంతోనే దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలడనే విషయాన్ని ధ్యానించండి.  దయతో ఒక మాట మాట్లాడటానికైనా, భారమైన హృదయంతో ఉన్నవారి మాట వినటానికైనా, ప్రేమతో ఒక సేవ చేయటానికైనా ఆయన హృదయం నుండి వచ్చే మృదువైన ప్రేరణలకు ఇష్టపూర్వకంగా స్పందిస్తే చాలు.  పవిత్రాత్మ ప్రేరణలకు స్పందనగా అది చేస్తే, అది ఆశ్చర్యకరంగా సులభంగానూ, ఆనందదాయకంగానూ ఉంటుంది; చేసిన ప్రయత్నానికి ఎంతో విలువ ఉంటుంది.  పవిత్రాత్మ రోజువారీ ప్రేరణలను మీరు ఎంత శ్రద్ధగా ఆలకిస్తున్నారో ఆలోచించండి. మళ్లీ అలాంటి ప్రేరణ కలిగినప్పుడు దాని ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నించండి.

ప్రభువా, నీ కారుణ్యానికి సాధనంగా పనిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా, ఇష్టపూర్వకంగా ఉండేలా చేయమని ప్రార్థిస్తున్నాను.  ప్రియమైన ప్రభువా, నీవు నాకు ఇచ్చే ప్రేరణల ప్రకారం నడుచుకోవడానికి నన్ను ప్రేరేపించు. అతి సరళమైన మార్గాల్లో నీ ప్రేమను ఇతరులకు వ్యక్తపరచడానికి నాకు సహాయం చేయి.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

సంవత్సరాంతంలో విరాళం ఇవ్వడం గురించి ఆలోచిస్తారా?

పునీత ఆండ్రూ క్రిస్మస్ నవదిన ప్రార్థన
సంప్రదాయంగా నవంబరు 30 నుండి క్రిస్మస్ పర్వదినానికి ముందు రోజు వరకు రోజుకు 15 సార్లు ప్రార్థిస్తారు.

ఆగమనకాలపు ఓ అంతిఫోనాలు
డిసెంబర్ 17–23

డిసెంబరు 23 – కాంటీకి చెందిన పునీత యోహాను, గురువు—ఐచ్ఛిక స్మరణ

ఆగమనకాల వనరులు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు