పవిత్ర త్రిత్వాన్ని ఆరాధిస్తున్న గొన్జాగా కుటుంబం — పీటర్ పాల్ రూబెన్స్ కృతి
ఆంగ్లంలో వినండి
పరమ పవిత్ర త్రిత్వాన్ని ఆరాధించడం, ప్రేమించడం మొదట మన ఆత్మలలోనే జరుగుతాయి. మనలో ప్రతి ఒక్కరి అంతరంగపు లోతుల్లో దేవుడు తనను ఆరాధించమని ఆహ్వానిస్తున్నాడు. అక్కడే, ఆత్మ అంతరంగంలోనే, దేవుని దైవకారుణ్యాన్ని మనం అనుభవిస్తాము. కారుణ్యం అంటే ఏమిటో మనం నేర్చుకోవడం అక్కడే ప్రారంభమవుతుంది (చూడండి డైరీ #6).
పరమ పవిత్ర త్రిత్వం మీలో నివసించడం గురించి ఈ రోజు కొంత సమయం ధ్యానించండి. దేవుడు అక్కడే, మీ ఆత్మలోనే నివసిస్తున్నాడు. ఆయనను వెదకండి, ప్రేమించండి, ఆయన దివ్య సన్నిధిని ఆరాధించండి.
పరమ పవిత్ర త్రిత్వ దేవా, నా ఆత్మలో నివసిస్తున్న నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. నేను నిన్ను మరింత లోతుగా వెదకి, నా పూర్ణహృదయంతో నిన్ను ప్రేమించగలుగుదును గాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
మొదటి నోటుపుస్తకంపై ధ్యానాలకు పరిచయాన్ని చదవండి
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




