“నలుగురు దేవదూతలతో కన్యమాత మరియు శిశువు” చిత్రించినది జెరార్డ్ డేవిడ్
ఆంగ్లంలో వినండి
నమ్మకంతో ప్రార్థిస్తూ మన ధన్యమాతను ఆశ్రయించండి. ఆమె మిమ్మల్ని తన నిర్మల హృదయానికి హత్తుకొని, తన కుమారుడైన యేసు వద్దకు నడిపిస్తుంది. ఆమె పరిపూర్ణ తల్లి, సమస్త కృపలకు తల్లి. ఆమె మాతృసంరక్షణపైనా మధ్యస్థ ప్రార్థనపైనా నమ్మకం ఉంచండి. తన కుమారుని కారుణ్య కృపలను ఎలా అందుబాటులోకి తేవాలో ఆమెకు తెలుసు. తన ప్రియమైన బిడ్డ అయిన మీ కోసం అలా చేయాలని ఆమె ఎంతో ఆశపడుతుంది (చూడండి దినచర్య #11).
కారుణ్యమాత అయిన మరియమ్మ తల్లితో మీకున్న సంబంధాన్ని గురించి ఈ రోజు నిజాయితీగా ఆలోచించండి. ఆమె మాతృసంరక్షణపైనా మధ్యస్థ ప్రార్థనపైనా మీకు నమ్మకం ఉందా? మన ధన్యమాతను మీరు హృదయపూర్వకంగా ప్రేమించకపోతే, ఆమె మాతృసంరక్షణపై పూర్తిగా నమ్మకం ఉంచకపోతే, ఆమె సంరక్షణ ద్వారా దేవుడు మీకు అనుగ్రహించాలనుకుంటున్న ఆశీర్వాదాలన్నిటికీ మీ హృదయాన్ని మరింత పూర్తిగా తెరవడానికి ఈ రోజు సమయం కేటాయించండి. ఆమెను ఆశ్రయించడానికి భయపడకండి. ఆమె తన కుమారుని వైపు మిమ్మల్ని నడిపిస్తుంది.
ప్రియాతిప్రియమైన తల్లీ, నా రాణీ. ప్రభువు తన కారుణ్య భాండాగారాన్ని నీకు అప్పగించారు. రాజాధిరాజు నిన్ను సింహాసనంపై కూర్చోబెట్టి, తన కారుణ్య నిర్వహణ బాధ్యతను నీకు అప్పగించారు. నీవు నాకు ప్రసాదించాలనుకుంటున్న వాటిని కోరుతూ, ఈ రోజూ ఎల్లప్పుడూ నీ చెంతకు రానిమ్ము. నీ కుమారుని దైవకారుణ్యాన్ని నాకు అందిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. ప్రియాతిప్రియమైన తల్లీ, నా కోసం ప్రార్థించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
జీవితం కోసం తొమ్మిది రోజులు — నవదిన ప్రార్థన
జనవరి 17 – ఈజిప్టుకు చెందిన పునీత ఆంథోనీ, మఠాధిపతి—జ్ఞాపకార్థం
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




