తెలుగు

ధ్యానం 23: దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించినప్పుడు

జొవాన్నీ బెల్లీని, వికీమీడియా కామన్స్ ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

కొన్నిసార్లు, కరుణామయుడైన మన ప్రభువును మరింతగా తెలుసుకోవాలని మనం ప్రయత్నించినప్పుడు, ఆయన మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుంది.  బహుశా పాపం అడ్డుపడి ఉండవచ్చు, లేదా దేవుని గురించి మీకున్న సొంత భావన ఆయన నిజమైన స్వరాన్ని, ఆయన నిజమైన సాన్నిధ్యాన్ని మరుగుపరచడానికి మీరు అనుమతించి ఉండవచ్చు.  మరికొన్ని సందర్భాల్లో, యేసు ఒక కారణంతో తన సాన్నిధ్యాన్ని దాచుకొని, మరుగున ఉండిపోతారు.  మనలను మరింత లోతుగా తనవైపు ఆకర్షించడానికి ఆయన అలా చేస్తారు.  ఈ కారణంగా దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తే చింతించకండి.  ఇది ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక భాగమే (చూడండి డైరీ #18).

దేవుడు మీకు ఎంత సన్నిహితంగా ఉన్నట్లు అనిపిస్తుందో ఈ రోజు ధ్యానించండి.  బహుశా ఆయన ఎంతో సన్నిహితంగా ఉండవచ్చు, లేదా దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు.  ఇప్పుడు ఆ భావనను పక్కనపెట్టి, మీకు అనిపించినా అనిపించకపోయినా దేవుడు ఎల్లప్పుడూ మీకు ఎంతో సన్నిహితంగా ఉంటారనే సత్యాన్ని గ్రహించండి.  ఆయనపై నమ్మకం ఉంచండి; మీకు ఎలా అనిపించినా ఆయన ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారని తెలుసుకోండి.  ఆయన దూరంగా ఉన్నట్లు అనిపిస్తే, ముందుగా మీ అంతఃకరణాన్ని పరిశీలించుకోండి, అడ్డుగా ఉన్న పాపమేదైనా ఉంటే దానిని అంగీకరించండి. ఆ తరువాత, మీరు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా, ఆ పరిస్థితిలోనే ఆయనపట్ల ప్రేమను, నమ్మకాన్ని వ్యక్తం చేయండి.

ప్రభువా, నిన్ను, నాపట్ల నీకున్న అనంతమైన ప్రేమను నేను విశ్వసిస్తున్నాను కాబట్టి నీపై నమ్మకం ఉంచుతున్నాను.  నీవు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటావనీ, నా జీవితంలోని ప్రతి క్షణంలో నాపట్ల శ్రద్ధ వహిస్తావనీ నమ్ముతున్నాను.  నా జీవితంలో నీ దివ్యసాన్నిధ్యాన్ని నేను అనుభవించలేనప్పుడు, నిన్ను వెదకడానికి, నీపై మరింతగా నమ్మకం ఉంచడానికి నాకు సహాయం చేయి.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

జీవితం కోసం తొమ్మిది రోజులు — నవదిన ప్రార్థన

జనవరి 23: పునీత మరియాన్ కోప్, కన్య—అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఐచ్ఛిక స్మరణ

పునీత విన్సెంట్, ఉపపరిచారకుడు, వేదసాక్షి—ఐచ్ఛిక స్మరణ
(అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జనవరి 23న జరుపుకుంటారు)

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు