తెలుగు

ధ్యానం 200: ప్రేమ, బాధల ఏకత్వం

చిత్ర సౌజన్యం: అన్‌స్ప్లాష్

వీడియో

ఆంగ్లంలో వినండి

ప్రేమ, బాధ ఒకదానికొకటి విరుద్ధమైనవా?  మరో మాటలో చెప్పాలంటే, మీరు ఎంతో బాధను అనుభవిస్తున్నా మీలో గొప్ప ప్రేమ కూడా ఉండగలదా?  ఆలోచించవలసిన ఒక ప్రశ్న ఇది: మీ బాధకు మూలం ఏమిటి?  అది మీ పాపమా?  అది మరొకరిపట్ల కనికరమా?  అది శారీరకమైన లేదా మానసికమైన గాయమా?  నిజం ఏమిటంటే, ప్రతి బాధా మీ హృదయంలో ప్రేమతో ఏకం కాగలదు.  మీ పాపం ఫలితంగా మీరు అనుభవించే బాధ విషయంలో కూడా ఇది నిజమే.  పాపం దేవుని నుండి వచ్చేది కాదన్నది స్పష్టం. అయితే, మీ పాపం ఫలితంగా మీరు అంతరంగంలో బాధను అనుభవించినప్పుడు, అది మీ అంతరాత్మ పనిచేస్తోందనడానికి ఒక సూచన; అది మంచిదే.  పాపం వల్లనైనా, మరే ఇతర కారణం వల్లనైనా మీరు అనుభవించే ప్రతి విధమైన బాధనూ కారుణ్యానికి ప్రేరణగా మారనివ్వడమే లక్ష్యం.  ముందుగా, మీరు అనుభవించే వేదనను దేవుని కారుణ్యం ఉపశమింపజేయనివ్వాలి. ఆ తరువాత, ప్రభువు కారుణ్యం నుండి వచ్చే ఆ ప్రేమ మీ బాధను మీ సొంత కారుణ్యంగా మార్చనివ్వాలి.  బాధ, కారుణ్యం మీ హృదయంలో కలుసుకోవాలి; అక్కడి నుండి ఇతరులకు విస్తరించాలి (చూడండి డైరీ #1050).

మీ హృదయంలో మీకు ఏమి కనిపిస్తోంది?  మీరు అనుభవిస్తున్న బాధ ఏదైనా ఉంటే, దానిని స్పష్టంగా గుర్తించండి.  దానికి కారణం ఏదైనా సరే, దానిని గమనించి అనుభవించండి.  మీరు అలా చేస్తున్నప్పుడు, క్రీస్తు హృదయం నుండి ప్రవహించే కృప మీలోకి ప్రవేశించనివ్వండి.  అది మీలోకి ప్రవేశించడానికి మీరు అనుమతిస్తున్నప్పుడు, మీ పట్ల మీతోనే మొదలుపెట్టి అందరిపట్లా కారుణ్యం, కనికరం నిండిన హృదయంగా మీ బాధను మార్చడానికి ఆయనను అనుమతించండి.  దేవుని కారుణ్యం సమృద్ధిగా ఉంది; అది జీవితంలో మనం అనుభవించే ప్రతిదానినీ, మన బాధను సైతం, తన నీడలో కప్పగలదు.  మీ హృదయంలో మీ బాధ దైవకారుణ్యాన్ని కలుసుకోనివ్వండి; అప్పుడు మీరు శాశ్వతంగా మారిపోతారు.

ప్రభువా, నా హృదయంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను.  వచ్చి అక్కడ నివసించు; నీ దైవకారుణ్యాన్ని సమృద్ధిగా కుమ్మరించి, నాలో ఉన్నదంతా మార్చు.  ప్రియ ప్రభువా, అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించడానికి, నా జీవితంలో నీ సాన్నిధ్యం నీ మహిమ కొరకు నన్ను మార్చేలా అనుమతించడానికి నాకు దయచేయి.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు