తెలుగు

ధ్యానం 277: ఒత్తిడిని తొలగించే కారుణ్యం

పునీత స్తెఫానును రాళ్లతో కొట్టడం, లూయిజీ గార్జీ చిత్రకృతి

వీడియో

ఆంగ్లంలో వినండి

ఒత్తిడి తరచుగా జీవితంలో ఒక భాగంగా ఉంటుంది.  కొందరు తమ దైనందిన జీవితంలో ఎంతో ఒత్తిడిని, నిరాశను, తీవ్రమైన కోపాన్ని కూడా ఎదుర్కొంటారు.  మొదట్లో, మరొకరి కోపం మిమ్మల్ని అప్రమత్తులను చేసి, భయపడేలా ప్రేరేపించవచ్చు.  ఇది సహజమైన ప్రతిస్పందన.  మరొకరి కోపం, మీరు కూడా మీ కోపంతో, కక్షతో, ద్వేషభావంతో ప్రతిస్పందించి ఎదురుదాడి చేసేలా మిమ్మల్ని ప్రేరేపించవచ్చు.  మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఎదుటివారిపై విరుచుకుపడవచ్చు కూడా.  కానీ దేవుని కారుణ్యం ఎలాంటి పరిస్థితిలోనైనా శాంతిని తీసుకురాగలదు.  మరొకరి నుండి మీకు ఎదురయ్యే కోపాన్ని పట్టించుకోకుండా, మీరు యేసుతో ఎంత మృదువుగా మాట్లాడతారో వారితోనూ అంతే మృదువుగా మాట్లాడినప్పుడు ఆయన కారుణ్యం అనుగ్రహించబడుతుంది.  దేవుని ఉగ్రతను దేవునికే వదిలివేయండి.  తన పవిత్ర ఉగ్రతను వ్యక్తపరచడానికి ఆయన మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో మీకు తెలుస్తుంది; అది ఆయన కారుణ్య కార్యం అవుతుంది.  అయితే అలాంటి పరిస్థితిలో అసాధారణమైన దయతో ప్రవర్తించమని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆశ్చర్యపడకండి.  దీనికి గొప్ప దృఢసంకల్పం, అపారమైన సహనం అవసరం. మరొకరి విచక్షణారహితమైన ఉగ్రతకు మీరు లోబడటానికిగానీ, అందులో చిక్కుకోవటానికిగానీ అనుమతించకండి.  దానికి బదులుగా, దేవుని కారుణ్యం ప్రసాదించే శాంతి మీ ఆత్మను ఎంతగా నింపనివ్వండంటే, మీ ద్వారా ఆయన కృప సమస్త దుర్గుణాలను పారద్రోలాలి (చూడండి డైరీ #1377).

మీరు తరచుగా ఎదుర్కొనే ఒత్తిడి, కోపంతో కూడిన పరిస్థితుల గురించి ఆలోచించండి.  బహుశా వాటికి మీరే కారణం కావచ్చు లేదా ఇతరుల కోపానికి మీరు గురవుతుండవచ్చు.  ఏదేమైనా, దేవుని శాంతి ఏలగలదని తెలుసుకోండి.  ఆయన శాంతిని వెదకండి, మీ దృష్టిని దానిపైనే నిలపండి; ఈ దృఢమైన ఏకాగ్రత ఆయన సమృద్ధియైన కారుణ్యానికి ఒక మూలంగా మారనివ్వండి.  ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఈ భారాల నుండి మిమ్మల్ని విముక్తులను చేయాలని కోరుకుంటున్నారు.

ప్రభువా, నా జీవితంలోని ఒత్తిడిలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను.  ముందుగా, నా నిరాశలను, కోపాన్ని నీకు సమర్పిస్తున్నాను.  దయచేసి అదుపులేని ఈ ఉద్రేకాల నుండి నన్ను విముక్తి చేసి, వాటి స్థానంలో నీ శాంతిని నింపు.  ప్రియమైన ప్రభువా, మరొకరి అన్యాయమైన ఉగ్రతను ఎదుర్కొన్నప్పుడు కూడా నాకు సహాయం చేయి.  నన్ను ప్రశాంతంగా ఉంచి, నా దృష్టిని నీ హృదయంపై నిలిపి ఉంచు.  నీ చిత్తానుసారం ప్రతిస్పందించడానికి, నీ శాంతికి సాధనంగా ఉండటానికి నాకు సహాయం చేయి.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

నేటి పునీతులు – అస్సీసి పునీత ఫ్రాన్సిస్
ఈ సంవత్సరం ఆదివారం నాడు వస్తున్నందున ఈ జ్ఞాపకార్థాన్ని ప్రార్థనారీతిలో జరుపుకోరు


ఈ-పుస్తకం & పేపర్‌బ్యాక్ రూపాల్లో లభ్యం:
అమెజాన్ కిండిల్ – అమెజాన్ పేపర్‌బ్యాక్ – గూగుల్ ప్లే – ఐట్యూన్స్ – బార్న్స్ & నోబుల్

సభ్యత్వం పొందండి మా యూట్యూబ్ ఛానల్‌లో!
కొత్త విషయాలు ప్రచురించినప్పుడు తెలియజేయబడుతుంది.

అక్టోబరు పవిత్ర జపమాల మాసం

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు