తెలుగు

ధ్యానం 142: ప్రభువు శాంతి చెడును పారద్రోలుతుంది

పైన ప్రదర్శించిన చిత్రాన్ని అందించినవారు: మాగ్దా ఎహ్లర్స్, మూలం: పెక్సెల్స్

వీడియో

దుష్టుడైన సాతాను ఉనికిని గుర్తించడం ముఖ్యం. అతని కోపాన్ని, ద్వేషాన్ని గ్రహించడం కూడా ముఖ్యం. మనం అర్థం చేసుకోగలిగిన దానికంటే అతని ద్వేషం మరింత తీవ్రమైనది. మనలను ద్వేషించడం, తన శక్తులన్నిటితో మనలను నాశనం చేయడానికి ప్రయత్నించడం మానుకోవడం అతని నియంత్రణకు మించినది. ఇది తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? ఎందుకంటే దుష్టుడు నేరుగా గానీ, మరొకరిలో అతడు “ప్రేరేపించిన” కోపం ద్వారా గానీ మనపై దాడి చేసినప్పుడు, మనం భయంతో, దిగ్భ్రాంతితో లేదా మనలోనూ కోపంతో ప్రతిస్పందించే ధోరణి కలిగి ఉంటాము. తిరిగి పోరాడాలని మనకు అనిపిస్తుంది. కానీ అపవాది తీవ్రమైన ద్వేషాన్ని మనం అర్థం చేసుకుంటే, తన ద్వేషంలోకి, కోపంలోకి మనలను లాగాలని అతడు కోరుకుంటున్నాడని గ్రహిస్తాము. కాబట్టి, అతని ద్వేషం మనకు ఏ రూపంలో ఎదురైనా, అతని నుంచీ అతని దాడుల నుంచీ దృష్టి మరల్చుకొని, దేవునితో శాంతిలో నిలిచి ఉండటమే ఉత్తమమైన ప్రతిస్పందన. మన ఆత్మలోని శాంతి అతనినీ, మనకు అతడు చేయాలనుకునే వాటన్నిటినీ పారద్రోలుతుంది. అతని కోపంపై మనం ఒక్క క్షణం కూడా దృష్టి పెట్టడం గానీ, దానితో తలపడటం గానీ విలువైనది కాదు (చూడండి: డైరీ #713).

దుష్టునికీ, అతని దాడులకూ మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? అతని కపటమైన, నీచమైన పద్ధతులను మీరు గుర్తిస్తున్నారా? మీ శాంతిని దోచుకొని, మీ దృష్టిని విశ్వాసం నుంచి భయం వైపు మళ్లించడానికి అతడు చేసే ప్రయత్నాలను మీరు వివేచించగలుగుతున్నారా? ఈ రోజు, సిలువపై ఉన్న క్రీస్తును ధ్యానించి, మన రక్షకుడు మనకోసం చేసిన పరిపూర్ణ ప్రేమతో కూడిన ఈ రక్షణ కార్యం వైపు మీ చూపు తిప్పండి. అన్ని విషయాలలోనూ ప్రభువు వైపు తిరిగితే, ఆయన శాంతి మీలో నిలిచి ఉంటుంది; మనలను ద్వేషించేవాని అంధకారపు దాడులను ఆయన పారద్రోలుతాడు.

ప్రభువా, నా చూపును నీ వైపు తిప్పి, నా మనస్సును, హృదయాన్ని, భావాలను, ఉద్వేగాలను నీకు, నీకు మాత్రమే సమర్పిస్తున్నాను. అవివేకమైన భయం నుంచీ, దుష్టుని దాడులన్నిటి నుంచీ నన్ను విముక్తి చేయి. నీపై, నీపై మాత్రమే నమ్మకం ఉంచడం ద్వారా అతని దుష్ట పద్ధతులను వివేచించి, వాటి ప్రభావాలను తిరస్కరించగలుగుదును గాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

పవిత్రాత్మకు నవదిన ప్రార్థన
పెంతెకోస్తుకు సిద్ధపడేందుకు చేసే ప్రార్థన
శుక్రవారం, మే 15 – శనివారం, మే 23

నేటి పునీతులు – కాషియా పునీత రీటా

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు