చిత్ర సౌజన్యం: పిక్సాబే
ఆంగ్లంలో వినండి
పాపసంకీర్తన అంటే మీకు ఎందుకు భయం? ఈ మహిమాన్విత దివ్యసంస్కారం మన ప్రభువు సున్నిత హృదయం నుండి మీకు అందించబడుతోంది. ఈ మహిమాన్విత వరం ద్వారా యేసు మీరు మోస్తున్న భారాలను తొలగిస్తారు; తద్వారా మీరు ఆయన కారుణ్యంలో మరింత సంపూర్ణంగా పాలుపంచుకోగలుగుతారు. మీరు దీనిని అర్థం చేసుకుంటే, క్రమం తప్పకుండా పాపసంకీర్తనకు పరుగెత్తి వెళ్లడానికి ఏ సంకోచమూ ఉండదు. అది మీ దయనీయ స్థితిని బయటపెడుతుందని కాదు, ఆ స్థితిని నయం చేసి శాశ్వతంగా తొలగిస్తుంది కాబట్టి మీరు దానిని కోరుకుంటారు (చూడండి దినచర్య #1602).
సయోధ్య దివ్యసంస్కారమనే వరం పట్ల మీ వైఖరి ఎలా ఉందో పరిశీలించడానికి కొంత సమయం కేటాయించండి. మీలో సంకోచం కనిపిస్తే, దానికి కారణాన్ని పరిశీలించండి. మీ పాపాన్ని ఎదుర్కోవాలనే భయమా? గురువును ఎదుర్కోవాలనే భయమా? భయం ఎన్నడూ కారణం కాకూడదు. అంతిమ ఫలితంపై దృష్టి నిలిపి, మీలో ఉన్న భయాలన్నిటినీ విడిచిపెట్టండి. ఆ అంతిమ ఫలితం విముక్తి, దేవునితో ఐక్యత. ఇది మీకు అవసరమైన కారుణ్యం; దీనిని పొందినందుకు మీరు ఎన్నడూ పశ్చాత్తాపపడరు.
ప్రభువా, ఈ మహిమాన్విత దివ్యసంస్కారం పట్ల నాకున్న భయం నుండి దయచేసి నన్ను విడిపించు. నీ అనంత కారుణ్యాన్ని కూడా చూస్తూనే, నా పాపాలను నిజాయితీగా చూడటానికి నాకు సహాయం చేయి. ఈ కారుణ్యం కోసం తీవ్రమైన కోరికను, అది ప్రసాదించే విముక్తి కోసం తపనను నా హృదయానికి దయచేయి. ప్రియ ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
నవంబరు 25 – అలెగ్జాండ్రియాకు చెందిన పునీత కతరీన, కన్య మరియు వేదసాక్షి
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




