తెలుగు

ధ్యానం 93: ప్రేమ, పాపాల సమాగమం

ఇదిగో ఈ మనిషి — అగోస్తినో కరాచ్చి కృతిని అనుసరించి రూపొందించినది

వీడియో

ఆంగ్లంలో వినండి

ప్రేమ, పాపం ఎక్కడ కలుసుకుంటాయి?  మన ప్రభువుపై జరిగిన హింసలో, హేళనలో, ఆయన పట్ల చూపిన దురుద్దేశంలో అవి కలుసుకుంటాయి.  ఆయన పరిపూర్ణ ప్రేమకు మానవావతారం.  ఆయన హృదయంలోని కారుణ్యం అనంతమైనది.  ప్రజలందరి పట్ల ఆయన చూపిన శ్రద్ధ, శ్రేయోభిలాష ఊహకందనివి.  అయినప్పటికీ సైనికులు ఆయనను ఎగతాళి చేశారు, ఆయనను చూసి నవ్వారు, వినోదం కోసం, సరదా కోసం ఆయనను చిత్రహింసలు పెట్టారు.  ఆయన మాత్రం వారిని పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించారు.  ఇది ప్రేమ, పాపాల నిజమైన సమాగమం (చూడండి దినచర్య #408).

ఇతరుల పాపాలను మీరు ఎదుర్కొన్నారా?  మీ పట్ల ఎవరైనా కక్షతో, కఠినంగా, దురుద్దేశంతో ప్రవర్తించారా?  అలా అయితే, మీరు ఆలోచించవలసిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది.  మీరు ఎలా స్పందించారు?  అవమానానికి బదులుగా అవమానాన్ని, హానికి బదులుగా హానిని తిరిగి చేశారా?  లేక మన దివ్య ప్రభువులా ఉండటానికి సిద్ధపడి, పాపాన్ని ప్రేమతో ఎదుర్కొన్నారా?  దురుద్దేశానికి బదులుగా ప్రేమను చూపడం, లోక రక్షకుణ్ణి మనం అనుకరించే అత్యంత గొప్ప మార్గాలలో ఒకటి.

ప్రభువా, నన్ను హింసించి, నా పట్ల పాపపూరితంగా ప్రవర్తించినప్పుడు, నా మనసు గాయపడుతుంది, నాకు కోపం వస్తుంది.  నీ పరిపూర్ణ ప్రేమను అనుకరించేలా ఈ ధోరణుల నుండి నాకు విముక్తిని ప్రసాదించు.  నీ దివ్య హృదయం నుండి పొంగిపొర్లే ప్రేమతో, నాకు ఎదురయ్యే ప్రతి పాపాన్ని ఎదుర్కోవడానికి నాకు సహాయం చేయి.  క్షమించడానికి, తద్వారా ఎన్నో పాపాలు చేసినవారికి నీ సాన్నిధ్యంగా ఉండటానికి నాకు సహాయం చేయి.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ఏప్రిల్ 3 – ప్రభువు శ్రమల శుభశుక్రవారం

ముప్పై తొమ్మిదవ రోజు ధ్యానాలు:
ఎడారిలో 40 రోజులు & సిలువ చెంత 40 రోజులు

మొదటి రోజు: దైవకారుణ్య ఆదివారానికి సిద్ధపడేందుకు నవదిన ప్రార్థన
శుభశుక్రవారం దైవకారుణ్య నవదిన ప్రార్థనలో మొదటి రోజు

పాస్కా కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు