పిశాచిచే శోధింపబడిన క్రీస్తు — జాన్ రిట్టో పెనిమన్ కృతి
ఆంగ్లంలో వినండి
దుష్టుని తీవ్రమైన ద్వేషాన్ని తప్పించుకోవాలని మీరు కోరుకుంటే, పవిత్రత కోసం కృషి చేయడం మానుకోండి. సాతాను అప్పటికీ మిమ్మల్ని ద్వేషిస్తాడు, కానీ ఒక పరిశుద్ధ వ్యక్తిని ద్వేషించినంతగా మిమ్మల్ని ద్వేషించడు. అయితే, ఇది మూర్ఖత్వమే కదా! దుష్టుని ద్వేషాన్ని తప్పించుకోవడానికి ఎవరైనా పవిత్రతను ఎందుకు దూరం చేసుకుంటారు? మనం దేవునికి ఎంత దగ్గరవుతామో, దుష్టుడు మనల్ని నాశనం చేయడానికి అంత ఎక్కువగా ప్రయత్నిస్తాడన్నది నిజం. దీని గురించి తెలుసుకోవడం మంచిదే అయినా, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి, దుష్టుని దాడులను మనం దేవునికి దగ్గరగా ఉన్నామనడానికి సూచనలుగా చూడాలి (చూడండి డైరీ #412).
మీరు ఏయే సందర్భాలలో భయంతో ఉక్కిరిబిక్కిరయ్యారో ఈ రోజు ధ్యానించండి. చాలా తరచుగా, దుష్టుని మోసమూ దురుద్దేశమూ మిమ్మల్ని ప్రభావితం చేయడానికి మీరు తావివ్వడం వల్లనే ఈ భయం కలుగుతుంది. భయం మిమ్మల్ని ప్రభావితం చేయనివ్వకుండా, మీరు ఎదుర్కొనే చెడు దేవునిపై మీ విశ్వాసం, నమ్మకం పెరగడానికి కారణమయ్యేలా చూడండి. చెడు మనల్ని కృంగదీస్తుంది లేదా దేవుని కృపలోనూ బలంలోనూ మనం ఎదగడానికి ఒక అవకాశంగా మారుతుంది.
ప్రభువా, భయం వల్ల ప్రయోజనం లేదు; అవసరమైనది విశ్వాసమే. దుష్టుని దాడుల వల్ల కలిగే భయానికి లోబడకుండా, ప్రతిరోజూ నీ మృదువైన ప్రేరణల ఆధీనంలో ఉండేలా నా విశ్వాసాన్ని పెంచమని వేడుకుంటున్నాను. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
నలభయ్యవ రోజు ధ్యానాలు:
ఎడారిలో 40 రోజులు & సిలువ చెంత 40 రోజులు
రెండవ రోజు: దైవకారుణ్య ఆదివారానికి సిద్ధపడేందుకు నవదిన ప్రార్థన
పవిత్ర శనివారపు ప్రార్థనా ధ్యానం
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




