తెలుగు

ధ్యానం 95: దేవుని కారుణ్యంపై నమ్మకం ఉంచడం

చిత్రకర్త: గెర్డ్ ఆల్ట్‌మన్ వేదిక: పిక్సాబే

వీడియో

ఆంగ్లంలో వినండి

మీరు విశాలమైన సముద్రం మధ్యలో ఒక వస్తువును పడవేస్తే, ఆ వస్తువు తడిసిపోతుందని మీకు ఎంతో దృఢమైన నిశ్చయం ఉంటుంది.  అపారమైన ఆ సముద్రం దానిని పూర్తిగా ముంచివేస్తుంది.  దేవుని కారుణ్యం కూడా అలాంటిదే.  అది అపారమైనది, అనంతమైనది.  కాబట్టి, మీరు ఆయన కారుణ్యంపై నమ్మకం ఉంచితే, దానిని పొందుతారనే దృఢమైన నిశ్చయంతో ఉండవచ్చు (చూడండి: డైరీ #420).

దేవుడు తన అనంతమైన కారుణ్యాన్ని మీపై కురిపిస్తారని మీరు నమ్ముతున్నారా?  ఈ విషయంలో నిశ్చయంగా ఉండటమే లక్ష్యం.  మన సొంత మంచితనం వల్ల మనం ఈ నిశ్చయానికి రాము; బదులుగా, పరమ పవిత్ర త్రిత్వం యొక్క అగాధమైన, అనంతమైన కారుణ్యం వల్లనే ఈ నిశ్చయానికి వస్తాము.

ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ అమూల్యమైన వరాన్ని నీవు నాకు అనుగ్రహిస్తావనే విషయంలో నా మనస్సులోనూ హృదయంలోనూ ఏ సందేహమూ లేనంతగా నీ పరిపూర్ణ కారుణ్యంపై నమ్మకం ఉంచాలని కోరుకుంటున్నాను. నీ అనంతమైన మంచితనాన్ని బట్టి నీ కారుణ్యంపై నమ్మకం ఉంచడానికి నాకు సహాయం చేయి.  ప్రియ ప్రభువా, నాలోని సందేహాలన్నిటినీ తొలగించి నన్ను శుద్ధి చేయి; నీపై మరింత నమ్మకం ఉంచడానికి నాకు సహాయం చేయి.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ఏప్రిల్ 5 – పాస్కా ఆదివారం

మూడవ రోజు: దైవకారుణ్య ఆదివారానికి సిద్ధపడే నవదిన ప్రార్థన

పాస్కా కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు