తెలుగు

ధ్యానం 158: మీ మాటల్లోని విషయాలు

తప్పిపోయిన కుమారుడు — చిత్రకారుడు: గెరార్డ్ వాన్ హోంత్‌హోర్స్ట్

వీడియో

ఆంగ్లంలో వినండి

మీరు రోజూ మాట్లాడే విషయాలు మీ ఆత్మలో ఉన్నవాటిని స్పష్టంగా ప్రతిబింబిస్తాయి.  మరి మీ మాటలు దేనిని ప్రతిబింబిస్తున్నాయి?  రోజంతా మీ సంభాషణలు పైపై విషయాల గురించి, ప్రాపంచిక విషయాల గురించే సాగాయని మీరు తరచుగా గమనించవచ్చు.  ఈ తరహా సరదా సంభాషణల్లో కొన్ని సహజమైనవి, ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ, దేవుని మహిమ గురించి, మీ విశ్వాస జీవితం గురించి కూడా మీరు క్రమం తప్పకుండా సంభాషిస్తున్నారని చెప్పగలగాలి.  మీ రోజువారీ మాటల్లో ప్రేమను, పవిత్రతను మీరు చూడగలగాలి.  ఇతరులను ఉన్నతంగా తీర్చిదిద్దే మాటలు కూడా మీ సంభాషణల్లో కనిపించాలి (చూడండి డైరీ #804).

గత వారంలో మీరు జరిపిన సంభాషణల గురించి ఆలోచించండి.  అవి ఏ విషయాల గురించి సాగాయి?  మీరు కపటంగా లేదా కఠినంగా మాట్లాడే ఉచ్చులో పడ్డారా?  ఇతరులను విమర్శించారా లేదా కించపరిచారా?  అలా అయితే, ఈ సంభాషణలు మీ ఆత్మ స్థితిని వెల్లడిస్తున్నాయి.  కొన్నిసార్లు మీ సంభాషణలు పాపపూరితమైనవి కాకపోయినా, సంపదపై మోజు, వినోదం, హాస్యం వంటి ప్రాపంచికమైన, ప్రాముఖ్యతలేని విషయాలే వాటిలో ఎక్కువగా ఉండవచ్చు.  వీటిలో ఏదీ దానికదే చెడు కాకపోయినా, మీ మాటల్లో ఎక్కువగా ఇవే ఉంటే, ప్రభువుకు చోటు చాలా తక్కువగా ఉంటుంది.  మీ మాటలు, రోజువారీ సంభాషణలు క్రీస్తుపట్ల మీకున్న గాఢమైన ప్రేమను ప్రతిబింబించేలా కృషి చేయండి.  మీ జీవితంలో సజీవంగా ఉన్న దేవుని కరుణ మీ మాటల ద్వారా పొంగిపొర్లనివ్వండి.  దేవుడు మీ ఆత్మ పవిత్రతను వెల్లడించి, ఇతరులకు పవిత్రతను అందించడానికి మిమ్మల్ని ఉపయోగించుకునే ముఖ్యమైన మార్గాల్లో ఇది ఒకటి.

ప్రభువా, నా మాటలను నీకు సమర్పిస్తున్నాను.  నా ప్రతి ఆలోచనను, నా నోటి నుండి వెలువడే ప్రతి మాటను నీకు అర్పిస్తున్నాను.  నీ మహిమను, నీ హృదయమంతా నిండియున్న కరుణను వెల్లడించడానికి దయచేసి నా మాటలను ఉపయోగించు.  ఈ కరుణ నా హృదయమంతా కూడా నిండి, అందరినీ పవిత్రతకు ఆహ్వానిస్తూ నా పెదవుల నుండి ప్రవహించును గాక.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ఆదివారం, జూన్ 7, 2026 – క్రీస్తు అతి పవిత్ర శరీర రక్తాల మహోత్సవం

దివ్యహృదయ నవదిన ప్రార్థన
సూచించిన నవదిన ప్రార్థన తేదీలు: జూన్ 3 – 11, 2026
అతి పవిత్ర దివ్యహృదయ మహోత్సవం జూన్ 12, 2026న జరుగుతుంది

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు