తెలుగు

ధ్యానం 164: పాపుల ఆత్మల కోసం తపన

సత్కాపరి జీన్ బాప్తిస్ట్ ద షాంపేన్ గీసినదిగా భావించబడుతున్నది

వీడియో

ఆంగ్లంలో వినండి

స్పష్టంగా కనిపించే పాపంతో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు మీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? చాలామంది తృణీకారంతో, కఠినమైన తీర్పుతో స్పందిస్తారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే, మనం వారిని కఠినంగా ఖండిస్తాము. ఎవరైనా అనైతిక జీవితం గడుపుతుంటే, వారిని కించపరుస్తాము. చాలా తరచుగా, పాపం చేసినవారి పట్ల మన వైఖరి నిర్దయగా ఉంటుంది. ఇది ఒక సమస్య. నిజమే, పాపాన్ని పాపంగానే గుర్తించి, దానిని నిరోధించడానికి కృషి చేయాలి; ముఖ్యంగా అది ఇతరులపై ప్రభావం చూపుతున్నప్పుడు అలా చేయాలి. అయితే, పాపుల పట్ల మన హృదయాలలో ఎల్లప్పుడూ గాఢమైన ప్రేమ ఉండాలి. వారి పశ్చాత్తాపం కోసం మనం తపించాలి; వ్యక్తులుగా వారికి సహజసిద్ధంగా ఉన్న గౌరవాన్ని ఎల్లప్పుడూ గుర్తించాలి (చూడండి: డైరీ #842).

పాపం చేసినవారి పట్ల మీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? నిజాయితీగా ఉండండి; ముందుగా మీ అంతరంగంలో మీరు ఎలా స్పందిస్తున్నారో చూసుకోండి. మనమందరం పాపులమే. కొన్ని పాపాలు ఇతర పాపాలకన్నా స్పష్టంగా కనిపిస్తాయి; కొందరు బహిరంగంగానూ మొండిపట్టుదలతోనూ పాపజీవితం గడుపుతారు. అయితే, వారిని ఖండించడానికి మనం పూనుకోవాలా? ఒక కార్యం వాస్తవంగా ఎలాంటిదో మనం నిర్ణయించాలి, కానీ ఆ వ్యక్తిపై ఎన్నడూ తీర్పుతీర్చకూడదు. అది కేవలం దేవునికే చెందుతుంది. పాపాలు మరింత స్పష్టంగా కనిపించే వారి పట్ల మీ వైఖరిని గురించి ఆలోచించండి. కఠినంగా, విమర్శనాత్మకంగా మారడానికి బదులు, వారి పరివర్తన కోసం తపించేలా, వారి పనులు ఎలా ఉన్నప్పటికీ వారిని హృదయపూర్వకంగా ప్రేమించేలా అనుగ్రహించమని ప్రార్థించండి.

ప్రభువా, పాపుల పట్ల కారుణ్యంతో నిండిన హృదయాన్ని నాకు దయచేయి. జ్వలించే ప్రేమతో వారిని ప్రేమించడానికి, వారిపై తీర్పుతీర్చాలనే ప్రలోభాలకు లొంగకుండా ఉండటానికి నాకు సహాయం చేయి. నీ కారుణ్య హృదయంతో ప్రజలందరి పవిత్రతను కోరుకుంటూ, వారందరి కోసం నేను తపించేలా చేయి. నా పాపస్థితిని కూడా గుర్తించి, ప్రతిరోజూ నీ కారుణ్య హృదయాన్ని ఆశ్రయించేలా చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

జూన్ 13 – 

పాదువా నగర పునీత ఆంథోని, గురువు మరియు వేదపారంగతుడు—స్మరణ

మరియమ్మ విమల హృదయం—స్మరణ

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు