బంగారు రాశిని తిరస్కరిస్తున్న పునీత అంతోని, ఫ్రా అంజెలికో చిత్రణ
ఆంగ్లంలో వినండి
కొందరు సన్యస్త జీవితంలో భాగంగా ప్రార్థనతోను ఏకాంతంతోను కూడిన విశిష్ట జీవితానికి పిలువబడతారు. ప్రత్యేకించి, ఏకాంత తపస్వి జీవితానికో, బాహ్య ప్రపంచానికి దూరంగా మఠంలో నివసించడానికో పిలువబడేవారు ఉన్నారు. పవిత్రులైన వీరు లోకానికి దూరంగా ఉండి, నిశ్శబ్ద ప్రార్థనలోను పనిలోను తమ రోజులను గడుపుతారు. కానీ ఈ జీవితానికి లోకం దృష్టిలో ఏ విలువ ఉంది? ఇది అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన ప్రశ్న. లౌకిక దృష్టిలో, వారు సమాజానికి చేసేది చాలా తక్కువ. ప్రజలు వారిని కుతూహలంతోను ఆసక్తితోను చూడవచ్చు; వారి నుండి ప్రేరణ పొందవచ్చు, వారిని ప్రశంసించవచ్చు. అయితే అంతకు మించి వారి జీవితం గురించి అర్థం చేసుకోవడం అరుదు. ఈ పవిత్ర దైవపిలుపుల అపారమైన విలువను ఎన్నడూ తక్కువగా అంచనా వేయకండి. మరుగున సాగే వారి ప్రార్థనా, త్యాగ జీవితం మన ప్రభువు హృదయాన్ని ఆనందింపజేస్తుంది; లోకంలో ఆయన కారుణ్యానికి నిరంతర ఊటగా ఉంటుంది. నిజానికి, పవిత్రులైన వీరు లేకపోతే లోకం తీవ్రమైన ప్రమాదంలో ఉండేది. వారి ప్రార్థనా, త్యాగ జీవితాల ద్వారా ప్రభువు తన తీర్పులో అధిక భాగాన్ని నిలిపివేసి, దానికి బదులుగా కారుణ్యాన్ని ప్రసాదిస్తాడు (చూడండి దినచర్య #1434).
సన్యస్తుల మరుగైన దైవపిలుపు విలువను మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? వారి దైవపిలుపుకున్న గొప్ప విలువను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మిక జీవితాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి వారిని ఆదర్శంగా తీసుకోండి; వారి ప్రార్థనలు మీ జీవితంలో సమృద్ధిగా కారుణ్యాన్ని పొందే మార్గమని నమ్మండి. అంతేకాక, వారి ప్రార్థనా జీవితాన్ని ఏదో ఒక మేరకు అనుసరించడానికి మీరు కూడా పిలువబడ్డారనే విషయాన్ని ధ్యానించండి. బాహ్య ప్రపంచానికి దూరంగా మఠంలో నివసించడానికో, ఏకాంత తపస్విగా జీవించడానికో మీకు పిలుపు లేకపోయినా, లోతైన ఆంతరంగిక ప్రార్థనా జీవితానికి మీకు పిలుపు ఉంది. పవిత్రులైన వీరి రచనలు, సాక్ష్యం, విశిష్టమైన దైవపిలుపు ద్వారా వారి నుండి నేర్చుకోండి. మన లోకంలో వీరు సమృద్ధిగా కారుణ్యాన్ని అందించే సాధనాలు; వీరి ద్వారా దేవుని కారుణ్యాన్ని వెదకండి.
ప్రభువా, ఏకాంత ప్రార్థనా జీవితాలకు పిలువబడిన ఆ పవిత్రులను వరంగా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దయచేసి వారి దైవపిలుపులో వారిని పవిత్రపరచి, అనేక ఆత్మలను నీ రాజ్యానికి చేర్చేందుకు వారికి సహాయం చేయుము. వారి సాక్ష్యం, దైవపిలుపు అనేకులకు ఆంతరంగిక ప్రార్థనా జీవితంలో ప్రేరణనివ్వాలని ప్రార్థిస్తున్నాను. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
పునీత యూదా తద్దేవునికి నవదిన ప్రార్థన
ఆశలేని పరిస్థితులలోను, దిక్కుతోచని సమస్యలలోను
సంవత్సరంలో ఎప్పుడైనా, ప్రత్యేకించి అక్టోబరు 19–27 తేదీలలో ప్రార్థించవచ్చు
నేటి పునీతులు:
పునీతులు జాన్ దె బ్రెబెఫ్, ఐజాక్ జోగ్స్, గురువులు, వేదసాక్షులు; వారి సహచరులైన వేదసాక్షులు—అమెరికా సంయుక్త రాష్ట్రాలలో: జ్ఞాపకోత్సవం
సిలువ పునీత పౌలు, గురువు
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అక్టోబరు 20న జరుపుకుంటారు
సభ్యత్వం పొందండి మా యూట్యూబ్ ఛానల్లో!
కొత్త విషయాలు ప్రచురించినప్పుడు తెలియజేయబడుతుంది.
అక్టోబర్ నెల పవిత్ర జపమాలకు అంకితమైన మాసం
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




