తెలుగు

ధ్యానం 168: ఇతరులపై దేవుని కారుణ్యాన్ని కురిపింపజేయడం

క్రీస్తు మరియు పాపి — హెన్రిక్ సీమిరాడ్జ్‌కీ

వీడియో

ఆంగ్లంలో వినండి

పాపులను నరకాగ్ని నుండి విముక్తులను చేయగల శక్తి ఒక్కదానికి, కేవలం ఒక్కదానికే ఉంది.  అదే కారుణ్యం.  దేవుడు తన కారుణ్యాన్ని ఉచితంగా, సమృద్ధిగా అనుగ్రహిస్తారు. అయితే మన ప్రార్థనలను మనం అత్యంత విశ్వాసంతో, చిన్నపిల్లల వంటి నమ్మకంతో చేసినప్పుడు, వాటికి ప్రతిస్పందనగా కూడా తన కారుణ్యాన్ని అనుగ్రహించాలని ఆయన నిర్ణయించుకున్నారు.  నిర్మలంగా ఉండి, పాపుల పట్ల ప్రేమతో నిండిన హృదయాన్ని యేసు తిరస్కరించలేరు.  మీ హృదయం అలా మారాలి.  కారుణ్యం కోసం మీరు చేసే విన్నపానికి స్పందించడానికి ప్రభువు “కట్టుబడేంత” జ్వలించే ప్రేమతో పాపులను ప్రేమించడానికి మీరు కృషి చేయాలి.  మీ హృదయంలోని ప్రేమకు ప్రతిస్పందనగా, ప్రేమతో ఆయన తనంతట తానే కట్టుబడతారు (చూడండి డైరీ #873).

దేవుని కారుణ్యంపై మీకు ఒక రకమైన “శక్తి” ఉందని మీరు గ్రహిస్తున్నారా?  ప్రభువు అలా సంకల్పించారు కాబట్టే ఇది సాధ్యమవుతోంది.  మీ హృదయంలోని ప్రేమకు ప్రతిస్పందనగా, మీరు ప్రేమించేవారిపై తన కారుణ్యాన్ని కుమ్మరించాలని ఆయన సంకల్పించారు.  మీ ప్రేమ నిర్మలంగా, అచంచలంగా ఉన్నప్పుడు, అది క్రీస్తు హృదయం తన కృపను కుమ్మరించే ద్వారంగా మారుతుంది.  పాపుల పట్ల మీకున్న ప్రేమను గురించి ధ్యానించి, ఆ ప్రేమను మీ శక్తివంతమైన ప్రార్థనగా ప్రభువు ఎదుట ఉంచండి.  ఆయన మీ ప్రేమను చూసి, అపారమైన ఔదార్యంతో స్పందిస్తారు.

ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పాపులను కూడా ప్రేమిస్తున్నాను.  ప్రజలందరినీ మరింత గాఢంగా ప్రేమించడానికి, ఆ ప్రేమను నా నిర్మలమైన ప్రార్థనగా నీకు సమర్పించడానికి నాకు సహాయం చేయి.  నా హృదయంలోని ప్రేమ, నీవు నీ కృపను కుమ్మరించడానికి కారణంగా, నీ దైవకారుణ్యానికి సాధనంగా ఉండుగాక.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు