తెలుగు

ధ్యానం 328: పరలోకం

మనం ఎన్నటికీ గ్రహించలేనంత మహిమతో, పరిపూర్ణతతో నిండిన జీవితంలోకి పరలోకం మనలను ఆహ్వానిస్తుంది.  పరలోకంలో కూడా దేవుని, ఆయన కారుణ్యపు మహిమగల రహస్యాన్ని మనం పూర్తిగా గ్రహించలేము.  మహిమతోను కృపతోను ప్రకాశించే పరిశుద్ధులు పరలోకం నుండి మనవైపు ప్రేమతో చూస్తుంటారు…

ధ్యానం 315: కరుణ, కరుణ, మరింత కరుణ

దేవుని కరుణ గురించి మాట్లాడటం మీకు విసుగు కలిగిస్తుందా?  అది చెప్పిందే మళ్లీ చెప్పినట్లుగా, మనసును తాకనిదిగా అనిపిస్తుందా?  అలా అయితే, కరుణ గురించి మరింతగా మాట్లాడండి; సరికొత్త ఉత్సాహంతో దానిని ధ్యానించండి.  దేవుని కరుణ పట్ల మీకు ఎన్నడూ విసుగు కలగకూడదు.  దేవుని కరుణ ఎంత గొప్పది, ఎంత సమృద్ధిగా ఉన్నదంటే, పరలోకంలో అది ఎంత విస్తృతమైనదో, ఎంత విశాలమైనదో మీరు స్పష్టంగా చూస్తారు.  దానిని పూర్తిగా గ్రహించడం సాధ్యం కాదని మీరు గ్రహిస్తారు; ధ్యానించడంలో ఎన్నటికీ విసుగు చెందరు…

ధ్యానం 302: ఉన్నతమైన, శక్తిమంతమైన, తీక్షణమైన బుద్ధి

మన మనస్సులు దేవుని వరం. ఆయన ప్రతిరూపంలోనూ పోలికలోనూ మనం సృష్టించబడిన రెండు ప్రధాన విధానాలలో మనస్సు అనే వరాన్ని పొందడం ఒకటి. మరొకటి మన స్వేచ్ఛా సంకల్పం అనే వరాన్ని పొందడం. అయితే బుద్ధి ఒక అద్భుతమైన వరం; దానిని దేవుని కార్యానికి అర్పించాలి. మన ప్రభువు… అని ప్రార్థించడం మంచిది.

ధ్యానం 294: త్రిత్వాన్ని ధ్యానించడంలో ఎన్నడూ అలసిపోకండి

మీరు నిత్యత్వమంతా ఏమి చేస్తారో మీకు అర్థమవుతోందా? పరలోకాన్ని పొందే భాగ్యం మనకు కలిగితే, అక్కడి జీవితం పరమ పవిత్ర త్రిత్వాన్ని నిత్యం ధ్యానించడమే అవుతుంది. పరలోకంలో కాలం లేకపోయినా, ఉన్నట్లుగా ఊహించుకోండి. ఆ తరువాత త్రిత్వాన్ని ధ్యానిస్తున్నట్లు ఊహించుకోండి…

ధ్యానం 235: కారుణ్యానికి సరళమైన పిలుపు

మన విశ్వాసంలో మరింత లోతుగా ఎదుగుతున్న కొద్దీ, జీవితం మరింత సంక్లిష్టమవుతుందని తేలికగా భావించవచ్చు. ఉదాహరణకు, గణితశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించినప్పుడు, నేర్చుకునే ప్రతి కోర్సు అంతకుముందు నేర్చుకున్నదాని ఆధారంగా ముందుకు సాగుతుంది…

ధ్యానం 213: అవగాహన అనే ఆధ్యాత్మిక వరం

దేవుని రహస్యాలు మీకు అర్థమవుతున్నాయా? మీరు మన సభ విశ్వాసాన్ని ఎన్నో సంవత్సరాలపాటు అధ్యయనం చేసిన వేదాంత పండితులని ఊహించుకోండి. మన సభకు చెందిన వేదాంత శాస్త్ర విభాగాలన్నిటి పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన, ఈ రహస్యాల గురించి మీలో తప్పనిసరిగా నిజమైన అవగాహన కలుగుతుందా…

ధ్యానం 186: దేవునిచే భేదింపబడటం

దేవుడు మీ ఆత్మను “పూర్తిగా భేదించారా”? ఆయన మీలో “సర్వత్రా వ్యాపించి” ఉన్నారా? ఆయన దైవత్వంలో “కరిగిపోవడానికి”, ఆయన కారుణ్యం మిమ్మల్ని “ఆవరించడానికి” మీరు అనుమతిస్తున్నారా? దేవునితో మన సంబంధాన్ని వర్ణించడానికి మనం ఎన్నో మాటలు ఉపయోగించవచ్చు. దేవుడు ఎవరో, ఏమి… అనే విషయాలను వ్యక్తపరచడానికి అవన్నీ తోడ్పడినప్పటికీ…

ధ్యానం 180: యేసు శ్రమలు

సువార్తలతో పరిచయమున్న మనలో కొన్నిసార్లు క్రీస్తు శ్రమల పట్ల ఒక రకమైన ఉదాసీనత కలగవచ్చు. ప్రతి సంవత్సరం ఆ వృత్తాంతం చదువుతుంటే మనం వింటాము; ఆయన శ్రమలను చూపించే ఎన్నో చిత్రాలను చూశాము. ఇలా సుపరిచితమైపోవడం వల్ల, అది మనపై తగిన ప్రభావం చూపేందుకు మనం అవకాశం ఇవ్వకపోవచ్చు…

ధ్యానం 132: అవగాహనకు అందని దేవుడు

మనందరిలోనూ సాధారణంగా ఉండే ఒక ప్రవృత్తి కుతూహలం.  దాదాపు ప్రతి విషయం గురించి తెలుసుకోవాలనే కోరికతో మనలో సులభంగా కుతూహలం కలుగుతుంది.  పత్రికలు, వార్తా వ్యాసాలు, కార్యక్రమాలు, రోజువారీ కబుర్లు మొదలైనవన్నీ మన కుతూహలాన్ని తీర్చడమే లక్ష్యంగా ఉంటాయి.  ఈ కుతూహలం దేవుణ్ణి తెలుసుకోవాలనే కోరికగా మారాలి, అలాగే…

ధ్యానం 108: సభ స్వరం

ఎన్నో ఆంతరంగిక కృపలు, ప్రేరణలతో సహా అనేక విధాలుగా దేవుడు పునీతులతో మాట్లాడారు. అయితే పవిత్రతలో అత్యున్నత స్థాయిలో జీవించే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిపరుడైనా, చివరికి ఆయన సభ ద్వారా పలికే దేవుని స్వరానికి లోబడాలి. సభ, ముఖ్యంగా…