పునీత పౌలు మికీ మరియు సహచర హతసాక్షులు — లారెన్స్ ఓపీ సౌజన్యంతో, లైసెన్స్ CC BY-NC-ND 2.0.
ఆంగ్లంలో వినండి
అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు మాత్రమే కృతజ్ఞతతో ఉండటం సులభమే. కానీ కష్టకాలంలో మనమీద మనమే జాలిపడుతూ మనలో మనం ముడుచుకుపోతుంటాము. అయితే మీరు అన్ని విషయాలలో ప్రభువును మహిమపరచడం నేర్చుకోవాలి. దేవుడు మీకు లెక్కలేనన్ని ఆశీర్వాదాలను, అనుగ్రహాలను ఇస్తున్నాడు. వాటిపట్ల మీలో అపారమైన కృతజ్ఞత కలగాలి. కుటుంబ ఆశీర్వాదాలు, ఆధ్యాత్మిక ఓదార్పులు, విధులను నెరవేర్చడం మొదలైనవన్నీ కృతజ్ఞత తెలిపే సందర్భాలు కావాలి. అయితే కృతజ్ఞత జీవితంలోని ప్రతిదానిలోనూ, కష్టాలలో సైతం, నిండి ఉండాలి. “జీవితంలోని మంచి విషయాల” కారణంగా మాత్రమే కాకుండా, కష్టాలన్నిటిలోనూ ప్రభువును మహిమపరచడానికి ప్రయత్నించండి. దేవుడు తన మహిమ కోసం ప్రతిదానినీ ఉపయోగించగలడు; ఈ సత్యాన్ని బట్టి మనం రేయింబవళ్లు ఆనందించాలి (చూడండి డైరీ #1661-1662).
ఈ “సవాలు” గురించి ధ్యానించండి. మీరు అన్ని విషయాలలోనూ ఆనందాన్ని కనుగొని, ఏమి జరిగినా దేవునికి స్తుతిని, కృతజ్ఞతను అర్పించగలరా? దేవుడు అందుకు యోగ్యుడు; మీ నిరంతర స్తుతికి ఆయన అర్హుడు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. మీరు దీనిని గ్రహించినప్పుడు, అది అంతులేని స్తుతికి, కృతజ్ఞతాస్తుతికి మూలమవుతుంది.
ప్రభువా, నా జీవితంలోని అన్ని విషయాలకూ నిన్ను ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను, స్తుతిస్తున్నాను, నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నీవు ఇచ్చిన ఆశీర్వాదాలకు, జీవితం కష్టంగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. నీ పట్ల కృతజ్ఞతలో ఎదగడానికి, నీ కారుణ్యాన్ని బట్టి ఎల్లప్పుడూ ఆనందించడానికి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
డిసెంబర్ 9 – పునీత హువాన్ డియెగో, ఏకాంతవాసి—ఐచ్ఛిక స్మరణ
పునీత ఆండ్రూ క్రిస్మస్ నవదిన ప్రార్థన
సంప్రదాయంగా నవంబరు 30 నుండి క్రిస్మస్ పర్వదినానికి ముందు రోజు వరకు రోజుకు 15 సార్లు ప్రార్థిస్తారు.
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు
ఒక అద్భుతమైన క్రిస్మస్ కానుక!
దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు:
పునీత ఫౌస్టీనాతో 365 రోజులు





