తెలుగు

ధ్యానం 344: పాపం గురించి ఆందోళన చెందడం మానుకోండి

చిత్ర సౌజన్యం: పిక్సాబే.

వీడియో

ఆంగ్లంలో వినండి

ఇది అసాధారణమైన శీర్షికలా అనిపించవచ్చు.  పాపాన్ని నివారించడానికి మీరు శ్రద్ధగా కృషి చేయాలి కాబట్టి, దాని విషయంలో జాగ్రత్త వహించాలి.  అయితే దేవుని కారుణ్యం గురించి మీ అవగాహన సముద్రంతో పోలిస్తే ఒక నీటి బిందువు మాత్రమేనని మీరు గ్రహిస్తే, మీ జాగ్రత్తలు ఆందోళనలుగా మారడానికి అనుమతించరు.  జాగ్రత్త వహించడం అంటే మనస్సాక్షికి అనుగుణంగా మెలకువగా ఉండటం; అలా ఉండటం ఒక కృప.  అయితే దేవుని కారుణ్యపు వెలుగులో మీ పాపాన్ని నిజాయితీగా, క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు, మీ పాపం దేవుడు తొలగించలేనంత పెద్దదేమోనని మీరు ఎన్నడూ ఆందోళన చెందరు.  దానిని ఒక్క క్షణంలో, శాశ్వతంగా తుడిచివేయడమే ఆయన అత్యంత గొప్ప కోరిక (చూడండి: డైరీ #1665).

మీ పాపాలను అత్యంత నిజాయితీగా ఎదుర్కోవడంలో మీకు సంకోచం ఉందో లేదో ధ్యానించండి.  అలా ఎదుర్కోవడానికి మీరు సంకోచిస్తే, ఆయన అనంతమైన కారుణ్యాన్ని మీరు అర్థం చేసుకోలేదనడానికి అది ఒక సూచన.  ఆయన కారుణ్యాన్ని గ్రహించడమే ప్రతి పాపానికీ ఉత్తమ ఔషధమని తెలుసుకోండి.

ప్రభువా, నా పాపాన్ని నేను చూస్తున్నాను, కానీ దానిని మరింత స్పష్టంగా చూడాలని కోరుకుంటున్నాను.  ఆందోళన లేకుండా, భయం లేకుండా నా పాపాన్ని ఎదుర్కొనేలా నీ పరిపూర్ణ కారుణ్యాన్ని తెలుసుకునే కృపను నాకు దయచేయి.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

పునీత ఆండ్రూ క్రిస్మస్ నవదిన ప్రార్థన
సంప్రదాయంగా నవంబరు 30 నుండి క్రిస్మస్ పర్వదినానికి ముందు రోజు వరకు రోజుకు 15 సార్లు ప్రార్థిస్తారు.

ఆగమనకాల వనరులు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు


ఒక అద్భుతమైన క్రిస్మస్ కానుక!

దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు:
పునీత ఫౌస్టీనాతో 365 రోజులు