లూకాస్ క్రానాఖ్ ది ఎల్డర్, పబ్లిక్ డొమైన్, వికీమీడియా కామన్స్ ద్వారా
ఆంగ్లంలో వినండి
దేవుని శిక్ష గురించి ఆలోచించడం ఆహ్లాదకరంగా ఉండకపోవచ్చు. అయితే ఆయన శిక్షలు వాస్తవమైనవనీ, అవి ఆయన అపార కారుణ్యం చేతలలో వ్యక్తమయ్యే విధానమనీ అర్థం చేసుకోవాలి. ఆత్మలు దేవుని నుండి దూరమై, ఆయన కారుణ్యాన్ని తిరస్కరించినప్పుడు, అది ఆయన హృదయాన్ని లోతుగా గాయపరుస్తుంది. ఫలితంగా, వారిని అలసిపోకుండా వెదకడంలో దేవుడు మరింత “తపన” కనబరుస్తారని చెప్పవచ్చు. వారి హృదయాలను తెరవడానికి ఆయన అనుసరించే మార్గాలలో శిక్షలు ఒకటి. ఉదాహరణకు, పరిసయ్యుల గురించి ఆలోచించండి. వారు గర్వం, అహంభావంతో నిండిపోయారు; ప్రభువు వారిని తీవ్రంగా మందలించారు. అయితే గొప్ప కారుణ్యంతో వారిని తిరిగి తనవైపుకు తిప్పుకోవడానికే ఆయన అలా చేశారు. కొందరి విషయంలో అది ఫలించింది, మరికొందరి విషయంలో ఫలించలేదు (చూడండి డైరీ #1703).
దేవుని శిక్షల గురించి మీకు తెలుసా? ఉదాహరణకు, మీ పాపాల వల్ల కలిగే తీవ్రమైన అపరాధ భావనతో మీరు బాధపడ్డారా? అలా అయితే, దీనిని గమనించండి. మీరు దారి తప్పి ఉంటే, ముఖ్యంగా గర్వం వల్ల అలా జరిగి ఉంటే, ప్రభువు మీపై తన తీర్పును కుమ్మరిస్తారని తెలుసుకోండి. మీరు అలాగే కొనసాగితే, ఆయన దానిని ప్రతీకార తీవ్రతతో కుమ్మరిస్తారు. ఒక ఆత్మ మొండిపట్టుదలతో ఉన్నంతకాలం, దేవుని కారుణ్యం అందులో ప్రవేశించలేదు. అయితే ఈ శిక్షలు పవిత్రమైన అపరాధ భావనను కలిగించినప్పుడు, మనస్సాక్షి పనిచేస్తోందనీ, మార్పుకు సిద్ధంగా ఉందనీ అర్థం. అపరాధ భావనను పట్టుకొని ఉండకండి, దానిని నిర్లక్ష్యమూ చేయకండి. దేవుని కారుణ్యం వద్దకు పరుగెత్తండి; అప్పుడు ఆయన మీ పాపం నుండి మిమ్మల్ని విముక్తులను చేసి, మీ హృదయానికి తన శాంతిని తిరిగి ప్రసాదించగలరు.
ప్రభువా, అన్ని విషయాలలో నీ వైపు తిరగడానికి నాకు అవసరమైన కృపను దయచేసి ప్రసాదించు. నీ కారుణ్యపు తీవ్రమైన శిక్షలు నాకు ఎన్నడూ అవసరం కాకుండుగాక. అయితే ఈ కృప నాకు అవసరమైతే, నా పాపాల నుండి మనసు మార్చుకొని నీ వైపు తిరగడం ద్వారా దానికి స్పందించడానికి దయచేసి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
ఆగమనకాలపు ఓ అంతిఫోనాలు
డిసెంబర్ 17–23
పునీత ఆండ్రూ క్రిస్మస్ నవదిన ప్రార్థన
సంప్రదాయంగా నవంబరు 30 నుండి క్రిస్మస్ పర్వదినానికి ముందు రోజు వరకు రోజుకు 15 సార్లు ప్రార్థిస్తారు.
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు





