లేలియో ఓర్సి, CC0, వికీమీడియా కామన్స్ ద్వారా
ఆంగ్లంలో వినండి
ప్రలోభపెట్టే సాతాను నిజంగానే ఉన్నాడు, కానీ అతనికి భయపడవలసిన అవసరం లేదు. మీరు అతనిని ఏమాత్రం పట్టించుకోకూడదు. అతని ఆలోచనలతో తలపడకూడదు. అతనితో బేరమాడకూడదు. ప్రలోభాలు ఎదురైనప్పుడు మీలో ధైర్యం, దేవుని కారుణ్యంపై నమ్మకం, నిరీక్షణ ఉండాలి. ఇతరుల పాపాల గురించి కుతూహలం పెంచుకోకండి, వాటి గురించి మాట్లాడకండి, ఎవరైనా మీతో అనుచితంగా ప్రవర్తించినప్పుడు కలత చెందకండి, ఫిర్యాదు చేయకండి. అయోమయంలో ఉన్నప్పుడు ఇతరుల నుంచి వివేకవంతమైన సలహాను కోరండి. ఆ సలహా మీలో శాంతిని నిలిపేదిగా, ప్రభువు నుంచి వచ్చేదిగా ఉన్నంతవరకు దానిని ఆలకించండి. దృఢమైన నిశ్చయాలు కలిగి ఉండండి, ఈ లోకంలోని పోరాటాల గురించి చింతించకండి. మీ మనస్సును, హృదయాన్ని యేసుపై నిలిపి, మిమ్మల్ని రక్షించడానికి ఆయనను అనుమతించండి (చూడండి: డైరీ #1760).
దుష్టుని పీడనను అనుభవించినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? మీ భావోద్వేగాలు మిమ్మల్ని అదుపులోకి తీసుకొని, కోపం, నిరాశ, సందేహాలలోకి నెట్టివేయడానికి అనుమతిస్తారా? మీ అంతరంగంలో ఆధ్యాత్మిక పోరాటం చెలరేగినప్పుడు, ఒక రక్షణ మార్గం ఉంది. ప్రలోభాలపై గానీ చెడుపై గానీ కాకుండా యేసుపై మీ దృష్టిని నిలపండి. ఆయన శాంతిని వెదకండి, ఆయన కారుణ్యంలో ఆశ్రయం పొందుతూ ఉండండి. మీరు దీన్ని ఎంత బాగా ఆచరిస్తున్నారో ధ్యానించండి. మీకు కష్టంగా ఉంటే, ప్రార్థించాలని, మళ్లీ మళ్లీ ప్రార్థిస్తూనే ఉండాలని నిశ్చయించుకోండి.
ప్రభువా, నీవు, నీవు మాత్రమే దుష్టుని ప్రలోభాలను తిప్పికొట్టగలవు. నా దృష్టిని నీపై నిలిపి, నీ అపార కారుణ్యంపై నమ్మకం ఉంచడానికి నాకు కృపను దయచేయి. కష్టకాలంలో నీ శాంతిని, నేను భరించవలసి వచ్చే ప్రతిదానిని ఎదుర్కొనే ధైర్యాన్ని నాకు ప్రసాదించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
సంవత్సరాంతంలో విరాళం ఇవ్వడం గురించి ఆలోచిస్తారా?
డిసెంబర్ 26, 2025 – తొలి వేదసాక్షి పునీత స్తెఫాను—పండుగ
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




