తెలుగు

ధ్యానం 310: దుష్టుని మూర్ఖత్వం

పునీత అంతోని శోధన, చిత్రకారుడు డొమెనికో ఘిర్లాందాయో

వీడియో

ఆంగ్లంలో వినండి

సాతాను నిజంగా ఉన్నాడు; అతని శోధనలు కూడా నిజమైనవే. అతను మిమ్మల్ని పూర్తిగా ద్వేషిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటాడు. ఇది తెలుసుకోవడం మంచిది. అయితే దుష్టుడు ఎంతో జిత్తులమారి; ఇతరులను తనకు అనుకూలంగా మలచుకుంటాడు. పచ్చి అబద్ధాలతో చేసే శోధన చాలా మటుకు మిమ్మల్ని ఒప్పించలేదని అతనికి తెలుసు కాబట్టి, అతను మీతో అలాంటి అబద్ధాలు చెప్పడం అరుదు. బదులుగా, కొంతవరకు నిజమైన విషయాలను ఎంచుకొని, వాటిలో సూక్ష్మమైన అబద్ధాలను కలిపి, మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి అయోమయపరిచే మాటలు చెప్పాలని ప్రయత్నిస్తాడు. మీరు ఈ విషయం గురించో ఆ విషయం గురించో అతిగా ఆలోచించడం మొదలుపెట్టినట్లు గమనించవచ్చు. మీ తర్కం కొంతవరకు సమంజసంగానే అనిపించినా, ఆలోచిస్తున్నకొద్దీ మీలో విచారం, అయోమయం మొదలవుతున్నట్లు గమనించవచ్చు. అలాంటి క్షణాల్లో ఆలోచించడం ఆపి, దేవుని కారుణ్యం వద్దకు పరుగెత్తండి. మీ ఆలోచన దేవునిలో లీనమైనప్పుడు, మీకు నూతనోత్సాహం కలిగి, మనసు తేలికపడుతుంది. మీలో కొత్త ఆనందం, స్పష్టత కలగడం మొదలవుతుంది. కానీ దుష్టుడు మీపై తన ఇష్టానుసారం ప్రభావం చూపడం మొదలుపెట్టినప్పుడు, మీ ఆత్మలో ఇందుకు విరుద్ధమైన ఫలితాలు అనుభవమవుతాయి. అతని కపట మోసాలపట్ల అప్రమత్తంగా ఉండండి; వాటిని పట్టించుకోకండి (చూడండి డైరీ 1497-1499).

ఈ రోజు మీ ఆలోచనా తీరును గురించి ధ్యానించండి. శోధకుడు తన అత్యంత హానికరమైన పనిని చేసేది ఇక్కడే. ఈ పరిస్థితినో మరో పరిస్థితినో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మీకు ఎలా అనిపించిందో కూడా ఆలోచించండి. ముఖ్యంగా మీ ఆలోచనల ఫలితాలను గమనిస్తూ ఆత్మల వివేచనకు కట్టుబడి ఉండండి. మీరు అయోమయానికి గురైన ప్రతిసారీ లేదా తప్పుదారి పట్టిన ప్రతిసారీ తన కారుణ్యం వద్దకు పరుగెత్తి రావాలని ప్రభువు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అలాంటి క్షణాలపట్ల అప్రమత్తంగా ఉండండి; అవి దుష్టుని శోధనలు కావచ్చని తెలుసుకోండి. ఎల్లప్పుడూ ప్రభువుపై నమ్మకం ఉంచండి; మీ ఆలోచనలను నిరంతరం ఆయన పవిత్ర కారుణ్యానికి సమర్పించండి.

ప్రభువా, దుష్టుని అబద్ధాల నుండి, ఉచ్చుల నుండి నన్ను ఎల్లప్పుడూ కాపాడు. నీ అతి పవిత్ర నామంలో అతనిని, అతని క్రియలను గద్దిస్తున్నాను; నా ఆలోచనలన్నిటినీ నీకు అప్పగిస్తున్నాను. వచ్చి నా జీవితంలో నీ కారుణ్యాన్ని, సత్యాన్ని కుమ్మరించి, చీకటిని, విషాదాన్ని పూర్తిగా తొలగించు. ప్రియ ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

సభ్యత్వం పొందండి మా యూట్యూబ్ ఛానల్‌లో!
కొత్త విషయాలు ప్రచురించినప్పుడు తెలియజేయబడుతుంది.

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు