గాబ్రియేల్ మెట్సు, సార్వజనిక సంపద, వికీమీడియా కామన్స్ ద్వారా
ఆంగ్లంలో వినండి
గమనిక: ధ్యానాలు 1-10 సాధారణ పరిచయాన్ని అందించేవి: పునీత ఫౌస్టీనా డైరీకి మరియు దైవకారుణ్యానికి. ధ్యానం 11 నుండి, మనం దీనిలోని విషయాలను ధ్యానించడం ప్రారంభిస్తాం; అందుకు ఆధారంగా ఉటంకించేది డైరీని. ప్రస్తుతానికి, ఈ మొదటి 10 రోజులలో, ఏడాది పొడవునా ధ్యానించబోయే ఈ నూతన భక్తి సాధనను అర్థం చేసుకోవడానికి పునాది వేసేలా ఈ చిన్న ప్రారంభ పరిచయ ధ్యానాలను ఉపయోగించుకోండి. ఈ భక్తి సాధన దైవకారుణ్యం పట్ల భక్తిని పెంపొందించేది.
మానవావతారం అప్పటివరకు తెలిసినవాటన్నిటిలోకీ అత్యంత గొప్ప కారుణ్య కార్యం. ఆ తరువాత దానిని మించిన ఏకైక కార్యం, యేసు సిలువపై మరణించి తన రక్తంతో పాపాన్ని, మరణాన్ని నాశనం చేయడమే. సిలువ రక్తం ద్వారా జరిగిన లోక విమోచనం మనం ఎన్నటికీ పూర్తిగా గ్రహించలేని ప్రేమ, కారుణ్య కార్యం. ఈ ప్రేమలోతును మనం ఎన్నటికీ పూర్తిగా అర్థం చేసుకోలేము కాబట్టి, ఈ కార్యానికి మనం ఎంత కృతజ్ఞత చూపినా సరిపోదు.
ఈ రోజంతటిలో సమయం కేటాయించుకొని సిలువపై యేసు ప్రతిమను ధ్యానించండి. దానిని మీ చేతిలో పట్టుకోండి, దానివైపు చూడండి, మనసులో తలచుకోండి, దానిని ధ్యానించండి. ఆ తరువాత అప్పుడప్పుడు మీ కళ్ళు మూసుకొని, సిలువ మరణపు సంపూర్ణ వాస్తవికతను ధ్యానించడానికి ప్రయత్నించండి. ఇది సులభమైన బలి కాదు. అంతటి క్రూరత్వాన్ని భరిస్తూ, “తండ్రీ, వీరిని క్షమించు, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు” అని చెప్పడం మరీ కష్టమైనది. ఇదే దైవకారుణ్యం.
ప్రభూ, నీ సిలువను లోతుగా తిలకించడానికి, ఆ సిలువలో నిర్మలమైన కారుణ్య సాగరాన్ని కనుగొనడానికి నాకు సహాయం చేయు. ఆత్మార్పణతో కూడిన ఈ ప్రేమలో నన్ను కడిగి, నిత్య విమోచనాన్ని పొందడానికి నాకు సహాయం చేయు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
ధ్యానాలు 1-10 పరిచయాన్ని చదవండి
జనవరి 5 – బిషప్పు పునీత జాన్ న్యూమన్ స్మరణ
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు
మీరు నూతన సంవత్సరానికి సిద్ధంగా ఉన్నారా?
దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు: పునీత ఫౌస్తీనాతో 365 రోజులు ప్రారంభమైంది! దేవుని కారుణ్యపు ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న మనం, ఈ ప్రయాణంలో మాతో చేరేందుకు మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను ఆహ్వానించమని మిమ్మల్ని కోరుతున్నాము. ఈ విధంగా మాతో చేరేందుకు వారిని ఆహ్వానించండి:
- రోజువారీ ఈమెయిళ్ల కోసం నమోదు చేసుకోవడం ద్వారా
- మా దైనందిన కతోలిక ధ్యానాలు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా
- ప్రతిరోజూ మా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా
- దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు పుస్తకాన్ని పేపర్‌బ్యాక్ లేదా ఈ-పుస్తక రూపంలో కొనుగోలు చేయడం ద్వారా
ఈ నూతన సంవత్సరంలో దేవుని అపారమైన కరుణను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి!
అమెజాన్‌లో లభిస్తుంది





