తెలుగు

ధ్యానం 6: దైవకారుణ్య చిత్రం

“దైవకారుణ్యం” చిత్రకారుడు: యుజేనియుష్ కజిమిరోవ్‌స్కీ

వీడియో

ఆంగ్లంలో వినండి

గమనిక: ధ్యానాలు 1-10 సాధారణ పరిచయాన్ని అందించేవి: పునీత ఫౌస్టీనా డైరీకి మరియు దైవకారుణ్యానికి. ధ్యానం 11 నుండి, మనం దీనిలోని విషయాలను ధ్యానించడం ప్రారంభిస్తాం; అందుకు ఆధారంగా ఉటంకించేది డైరీని. ప్రస్తుతానికి, ఈ మొదటి 10 రోజులలో, ఏడాది పొడవునా ధ్యానించబోయే ఈ నూతన భక్తి సాధనను అర్థం చేసుకోవడానికి పునాది వేసేలా ఈ చిన్న ప్రారంభ పరిచయ ధ్యానాలను ఉపయోగించుకోండి. ఈ భక్తి సాధన దైవకారుణ్యం పట్ల భక్తిని పెంపొందించేది.

పునీత ఫౌస్టినా రచించిన డైరీ వివిధ మార్గాలలో ఒక నూతన భక్తి రూపానికి మనలను పిలుస్తుంది.  మొదటి మార్గం దైవకారుణ్య పవిత్ర చిత్రాన్ని ధ్యానించడం.  తన కారుణ్యమయ ప్రేమను అందరూ చూడగలిగేలా ఒక చిత్రాన్ని వేయించమని యేసు పునీత ఫౌస్టినాను కోరారు. అది యేసు హృదయం నుండి రెండు కిరణాలు ప్రకాశిస్తూ వెలువడుతున్న చిత్రం. మొదటి కిరణం నీలిరంగులో ఉంటుంది (లేదా మొదట చిత్రించినట్లుగా పాలిపోయిన తెలుపు రంగులో ఉంటుంది); అది జ్ఞానస్నానం ద్వారా ప్రవహించే కారుణ్యపు ఊటను సూచిస్తుంది. రెండవ కిరణం ఎరుపు రంగులో ఉంటుంది; అది పవిత్ర దివ్యసత్ప్రసాదంలోని రక్తం ద్వారా ధారగా ప్రవహించే కారుణ్యపు ఊటను సూచిస్తుంది. ఈ సంవత్సరంలో ఈ చిత్రాన్ని పరిచయం చేసుకోండి, మీ ఇంటిలో ఉంచుకోండి, దాని అర్థాన్ని మననం చేయండి.

ఈ రోజు దైవకారుణ్య చిత్రాన్ని మననం చేయండి.  ముఖ్యంగా, మన రక్షకుని హృదయం నుండి ధారగా ప్రవహించే ప్రేమలోని సంపూర్ణ గాఢతను వ్యక్తపరచడానికి ఏ చిత్రమూ కనీసం దగ్గరగా కూడా రాలేదనే సత్యాన్ని మననం చేయండి.  ఈ పవిత్ర చిత్రాన్ని మననం చేస్తూ, ఆ కారుణ్యం పట్ల మీ ఆకాంక్షను పెంపొందించుకోండి. 

ప్రభువా, నీ దివ్య హృదయం నుండి వెలువడే నీ అనంత కారుణ్యాన్ని నీవు లోకంపై కుమ్మరించావు. ఇప్పుడూ ఎల్లప్పుడూ ఆ కారుణ్యంలో నేను సేదదీరుదును గాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ధ్యానాలు 1-10 పరిచయాన్ని చదవండి

జనవరి 6 – పునీత ఆండ్రే బెసెట్, సన్యాసి—అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఐచ్ఛిక స్మరణ

 

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

అమెజాన్‌లో లభ్యం