తెలుగు

ధ్యానం 1: “ఆ” దైవకారుణ్యం

చిత్రం: pexels.com సౌజన్యంతో

వీడియో

ఆంగ్లంలో వినండి

గమనిక: ధ్యానాలు 1-10 సాధారణ పరిచయాన్ని అందించేవి: పునీత ఫౌస్టీనా డైరీకి మరియు దైవకారుణ్యానికి. ధ్యానం 11 నుండి, మనం దీనిలోని విషయాలను ధ్యానించడం ప్రారంభిస్తాం; అందుకు ఆధారంగా ఉటంకించేది డైరీని. ప్రస్తుతానికి, ఈ మొదటి 10 రోజులలో, ఏడాది పొడవునా ధ్యానించబోయే ఈ నూతన భక్తి సాధనను అర్థం చేసుకోవడానికి పునాది వేసేలా ఈ చిన్న ప్రారంభ పరిచయ ధ్యానాలను ఉపయోగించుకోండి. ఈ భక్తి సాధన దైవకారుణ్యం పట్ల భక్తిని పెంపొందించేది.

దైవకారుణ్యం గురించి మాట్లాడేటప్పుడు, దేవుని నుండి వచ్చే ఈ వరాన్ని మనం “ఆ దైవకారుణ్యం” అని పేర్కొంటాం. “ఆ” దైవకారుణ్యాన్ని ధ్యానించడం ద్వారా మనకు రెండు విషయాలు మరింత స్పష్టమవుతాయి:  మొదటిది, దేవుని దైవకారుణ్యం నిజమైనది, నిర్దిష్టమైనది, వాస్తవమైనది. అది ఏదో అమూర్త భావన కాదు; అది మనం అర్థం చేసుకొని, అందులోకి ప్రవేశించవలసిన వాస్తవం.  రెండవది, దైవకారుణ్యం ఒక్కటే ఉంది. అదే దేవుని ఏకైక వరం. దేవుడు మనకు ఇచ్చినదంతా వరమే; ఈ వరం కొరకు మనం నిత్యమూ కృతజ్ఞులమై ఉండాలి.

దేవుని దైవకారుణ్యాన్ని ధ్యానించే మహిమాన్వితమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మలచుకోవడానికి నేడు కృషి చేయండి.  ఈ సంవత్సరం మీ కొరకు దేవుడు కోరుకునే వాటన్నిటిలోకి ప్రవేశించాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకోండి.

ప్రభువా, నీవు రేయింబవళ్లు కుమ్మరించే దైవకారుణ్యాన్ని శ్రద్ధగా గమనించడానికి నాకు సహాయం చేయి. నీ కారుణ్యాన్ని ధ్యానించే ఈ సంవత్సరంలో, అది నా జీవితాన్ని నిజంగా, గాఢంగా రూపాంతరం చెందించేందుకు అనుమతించేలా నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ధ్యానాలు 1-10 పరిచయాన్ని చదవండి

జనవరి 1 – దేవమాత మరియ మహోత్సవం

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు


మీరు నూతన సంవత్సరానికి సిద్ధంగా ఉన్నారా?

దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు: పునీత ఫౌస్టీనాతో 365 రోజులు నేటి నుండి ప్రారంభమవుతుంది.  దేవుని కారుణ్యంతో నిండిన ఈ నూతన సంవత్సరానికి మనం సిద్ధమవుతున్న వేళ, ఈ ప్రయాణంలో మాతో చేరడానికి మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను ఆహ్వానించమని మిమ్మల్ని కోరుతున్నాం!  ఈ విధంగా మాతో చేరమని వారిని ఆహ్వానించండి:

  1. రోజువారీ ఈమెయిళ్ల కోసం నమోదు చేసుకోవడం ద్వారా
  2. మా దైనందిన కతోలిక ధ్యానాలు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా
  3. ప్రతిరోజూ మా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా
  4. దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు పుస్తకాన్ని పేపర్‌బ్యాక్ లేదా ఈ-పుస్తక రూపంలో కొనుగోలు చేయడం ద్వారా

ఈ నూతన సంవత్సరంలో దేవుని అపారమైన కరుణను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి!