తెలుగు

ధ్యానం 14: కారుణ్యం ద్వారానే నిజమైన తృప్తి

“వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ” — చిత్రకారుడు: గ్వెర్చినో

వీడియో

ఆంగ్లంలో వినండి

జీవితంలో మనం తరచూ ఈ లోకంలోని తరిగిపోయే వస్తువులలో తృప్తిని వెదుకుతుంటాం. అవి సంపదలైనా, శారీరక సుఖమైనా, ప్రతిష్ఠయైనా, మరేదైనా సరే, ఒకే ఒక్కటి మాత్రమే మనకు తృప్తినిస్తుందని మనం గ్రహించాలి. మనం వెదుకుతున్నది దేవుని దైవకారుణ్యాన్నే. మిగిలినవన్నీ తృప్తినిస్తాయనే భ్రమలే.  ఇతర విషయాలతో మన ఆత్మలను తృప్తిపరచుకోవడానికి ప్రయత్నిస్తే, మన అంతరంగంలో దుఃఖం, వ్యాకులత, ఆశాభంగం మిగులుతాయి. మనం స్పందించేవరకు దేవుని కారుణ్యం మనలను పిలుస్తూనే ఉంటుంది; మధురమైన వేదనను కలిగిస్తూనే ఉంటుంది (చూడండి డైరీ #8).

దేవుని కారుణ్యంలో కాక మరేదైనా దానిలో తృప్తిని పొందడానికి మీరు ప్రయత్నించిన ప్రతిసారీ మీ ఆత్మలో కలిగే “మధురమైన వేదన” గురించి ధ్యానించండి.  అది “మధురమైనది,” ఎందుకంటే అది తన కారుణ్యంపైనే నమ్మకం ఉంచమని మనలను పిలుస్తూ దేవుడు ప్రేమతో చేసే మందలింపు.  అది “వేదనకరమైనది,” ఎందుకంటే దేవునికి సంబంధించినది కాని దేనిపట్ల అనుబంధమైనా మన ఆత్మకు అనుకూలంగా ఉండదని మనం స్పష్టంగా గుర్తించడానికి సిద్ధపడాలి.  దేవుని కారుణ్యానికి వెలుపల ఉన్న విషయాలపట్ల ప్రతి అనుబంధమూ చివరికి మనకు భారంగా అనిపిస్తుంది.

ప్రభువా, నీకు సంబంధించినవి కాని వాటన్నిటినుండి వైదొలగమని నన్ను పిలిచే నీ కారుణ్యాన్ని నేను గ్రహించి, అనుభవించడానికి సిద్ధపడుదును గాక.  అన్ని విషయాల్లోనూ నీ కారుణ్యం వద్దకు పరుగెత్తడానికి, చివరికి నన్ను కుంగదీస్తూ వేదనను, భారాన్ని కలిగించే విషయాలనుండి వైదొలగడానికి నాకు సహాయం చేయుము.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మొదటి నోటుపుస్తకంపై ధ్యానాలకు పరిచయాన్ని చదవండి

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు