తెలుగు

ధ్యానం 34: దేవునిలో మాత్రమే తృప్తి

“క్రీస్తు మరియు ధనవంతుడైన యువ అధికారి” చిత్రకారుడు: హైన్రిఖ్ హోఫ్‌మాన్

వీడియో

ఆంగ్లంలో వినండి

జీవితంలో మనం తరచూ లౌకికమైన, గతించిపోయే విషయాలు మనకు తృప్తినిస్తాయని నమ్మే ఉచ్చులో పడిపోవచ్చు. మన పాపాలు మనకు తృప్తినిస్తాయని భావిస్తూ కూడా మోసపోవచ్చు. వింతగా అనిపించినా, అవి ఒక రకమైన తాత్కాలిక తృప్తిని ఇస్తాయి. కానీ ఈ “తృప్తి” పైపైది, మోసపూరితమైనది. దేవుడు తప్ప మరేదీ మన ఆత్మలకు తృప్తినివ్వదనే గాఢమైన అవగాహనకు వచ్చినప్పుడు, మనం ఆశీర్వదించబడతాము; ఆయనలో మాత్రమే నిజమైన తృప్తిని వెదకడానికి సుముఖులమవుతాము. ఆయన కారుణ్యాన్ని లోతుగా గుర్తించడం ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది (చూడండి దినచర్య #42).

దేవుని కారుణ్యంతో తృప్తి పొందాలని మీరు తపిస్తున్నారా? ప్రతిరోజూ ఆయన కారుణ్యాన్ని కోరుకుంటున్నారా? మీ హృదయంలోని కోరికలను గురించి ధ్యానించండి. మీరు దేనికోసం తపిస్తున్నారు? మీ కోరిక దేవునిపైనే, కేవలం దేవునిపైనే నిలిచేలా, ఈ రోజు అనారోగ్యకరమైన, అవివేకమైన మమకారాలనుంచి, కోరికలనుంచి దేవుని కృప మిమ్మల్ని విడిపించనివ్వండి.

ప్రభువా, నీ సమృద్ధమైన కారుణ్యంతో నా వద్దకు రమ్ము; గతించిపోయే ఈ లోకపు కోరికలనుంచి నన్ను విడిపించుము. అన్నిటికంటే ఎక్కువగా నిన్నే కోరుకోవడానికి, ఆ కోరికలో నీ దివ్యప్రేమలో మునిగిపోవడానికి నాకు సహాయపడుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ఫిబ్రవరి 3: పునీత బ్లేస్, పీఠాధిపతి, వేదసాక్షి—ఐచ్ఛిక స్మరణ

ఇంకా:

ఫిబ్రవరి 3: పునీత అన్‌స్గార్, పీఠాధిపతి—ఐచ్ఛిక స్మరణ

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు