తెలుగు

ధ్యానం 59: “ఓ రక్తమా, జలమా…”

క్రీస్తు ప్రక్కను బల్లెంతో పొడవడం — చిత్రకారుడు ఫ్రా ఆంజెలికో
ప్రధాన చిత్రం: జేమ్స్ టిస్సో చిత్రించిన బల్లెపు పోటు, బ్రూక్లిన్ మ్యూజియం ద్వారా

వీడియో

యేసు మరణించిన తరువాత, సైనికులలో ఒకడు ఆయన దగ్గరకు వచ్చాడు; ఆయన మరణించాడని నిర్ధారించుకోమని అతనికి ఆజ్ఞ ఇవ్వబడింది.  అందువల్ల ఆ సైనికుడు ఆయన అమూల్య దేహాన్ని బల్లెంతో పొడిచాడు; వెంటనే గాయపడిన ఆయన హృదయం నుండి రక్తం, నీరు ఉప్పొంగి ప్రవహించాయి.  యుగయుగాలుగా ఈ సంఘటనను ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తూ వచ్చారు. దీనిని జ్ఞానస్నానం, దివ్యసత్ప్రసాద స్వీకరణ అనే దేవద్రవ్యానుమానాలకు సూచనగా, అలాగే దివ్యసత్ప్రసాద రక్తం, జ్ఞానస్నాన జలం నేరుగా సిలువపై యేసు అర్పించిన పరిపూర్ణ బలిదానమనే సర్వోన్నత త్యాగార్పణ నుండి ఉద్భవిస్తాయనే సత్యానికి సూచనగా భావిస్తూ వచ్చారు (చూడండి డైరీ #187).

దేవుని అపార కారుణ్యాన్ని అందించే ఈ దేవద్రవ్యానుమానాల పట్ల మీ కృతజ్ఞతను ఈ రోజు పునరుద్ధరించుకోండి.  యేసు మనపై ప్రేమతో తన ప్రాణాన్ని బలిగా అర్పించడానికి సిద్ధపడినందువల్లనే ఇవి సాధ్యమయ్యాయనే విషయాన్ని ధ్యానించండి.  మనలను విమోచించడానికి ఆయన ఇష్టపూర్వకంగా, స్వేచ్ఛగా చెల్లించిన వెలను గురించి ఆలోచిస్తూ, ఆయన బలిదానం ఈ రోజు మీ హృదయాన్ని కృతజ్ఞతతో, భక్తిపూర్వక విస్మయంతో నింపనివ్వండి.

ప్రభువా, నీ సిలువ బలిదానంలో నీ ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది.  సిలువపై చివరి బొట్టు వరకు నీ కారుణ్యాన్ని కుమ్మరించినప్పుడు నీవు మాకు ఇవ్వకుండా ఏదీ ఉంచుకోలేదు.  ఈ త్యాగపూరిత ప్రేమ యొక్క గొప్ప రహస్యాన్ని చూడటానికి, అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయి.  నీవు చేసిన సమస్త కార్యాలకు కృతజ్ఞతతో నన్ను నింపు; ఇతరుల కోసం నన్ను నేను సంపూర్ణంగా అర్పించుకోవడంలో నిన్ను అనుసరించడానికి నాకు సహాయం చేయి.  యేసు హృదయం నుండి మాకు కారుణ్యపు ఊటగా ఉప్పొంగి ప్రవహించిన ఓ రక్తమా, జలమా, నేను మీపై నమ్మకం ఉంచుతున్నాను.

పదవ రోజు ధ్యానాలు:
ఎడారిలో 40 రోజులు & సిలువ చెంత 40 రోజులు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు