తెలుగు

ధ్యానం 118: మొండిపట్టుగల హృదయం

జేమ్స్ టిసో చిత్రించిన పరిసయ్యుడు మరియు సుంకరి, బ్రూక్లిన్ మ్యూజియం ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

దేవుని కారుణ్యం మన జీవితాల్లోకి ప్రవేశించకుండా మనం అడ్డుకునే ప్రధాన మార్గాల్లో ఒకటి మన మొండితనం.  ముఖ్యంగా, మన గర్వం కారణంగా మన సొంత అభిప్రాయాన్నే మొండిగా పట్టుకొని, సత్యాన్ని స్వీకరించడానికి మనసు తెరవనప్పుడు, మనం అనుగ్రహానికి తలుపు మూసివేస్తాము.  ఇది ప్రత్యేకంగా ప్రమాదకరమైన పాపం; ఎందుకంటే మొండితనం అంటేనే పశ్చాత్తాపపడి మారడానికి ఇష్టపడకపోవడం.  మొండిపట్టుగల వ్యక్తి రోజులు గడిచినా, సంవత్సరాలు గడిచినా, దేవుని అనుగ్రహానికి మనసు మూసుకొనే ఉంటారు.  మొండిపట్టుగల హృదయానికి ఏకైక చికిత్స దేవుని సత్యం ఎదుట వినయంగా ఉండటమే.  దేవుడు మాట్లాడిన క్షణమే మన దృఢాభిప్రాయాలను మార్చుకోవడానికి సిద్ధంగా, సుముఖంగా ఉండి, నిష్కపటంగా తెరచిన హృదయంతో ఆయన వద్దకు రావడం ఈ పాపం నుంచి విముక్తి పొందడానికి మొదటి అడుగు.  మీ సొంత దృఢాభిప్రాయాన్ని పక్కనపెట్టి, వినడం ద్వారా, మార్పును స్వీకరించడానికి సిద్ధంగా, సుముఖంగా ఉండటం ద్వారా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి.  మొదట్లో ఇది కష్టంగా ఉండవచ్చు, కానీ అలా చేసినందుకు మీరు నిజంగా కృతజ్ఞతతో ఉంటారు (చూడండి: డైరీ #560).

ఏ విషయంలో మీరు మొండిపట్టు పడుతున్నారు?  మరొకరికి వ్యతిరేకంగా ఎంతోకాలంగా మీ మనసులో నిలిచిపోయిన ఆలోచన ఏదైనా ఉందా?  ఏదైనా విషయంలో మీ అభిప్రాయమే సరైనదని మీరు దృఢంగా నమ్ముతున్నారా?  దేవుడు కూడా దానిని అలాగే చూస్తున్నారో లేదో నిర్ధారించుకోండి.  ఈ రోజు, మార్పును స్వీకరించడానికి ప్రయత్నించండి.  మీరు చూడగలిగేలా మీ కళ్ళు తెరవమని ప్రభువును అడగడం మొదటి అడుగు. మీ హృదయంలోని ఈ ధోరణిని మీరు గుర్తించేందుకు మిమ్మల్ని మీరు అనుమతించుకోవడం రెండవ అడుగు.

ప్రభువా, నాలో మొండితనం ఉందని నాకు తెలుసు.  నా ఆత్మలో దానిని చూస్తున్నాను.  నేను నా సొంత చిత్తాన్నే పట్టుకొని, గర్వం వల్ల ఇతరుల మాట వినడానికి నిరాకరిస్తున్నాను.  నా మొండితనాన్ని విడిచిపెట్టేలా, విశాలమైన మనసును నాకు అనుగ్రహించు.  నీ ఎదుట, ఇతరుల ఎదుట నన్ను నేను తగ్గించుకోవడానికి నాకు సహాయం చేయి; నీ సత్యాన్ని వినడానికి సిద్ధంగా, సుముఖంగా ఉండేలా నాకు తోడ్పడు.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ఏప్రిల్ 28 – 

పునీత పీటర్ షనెల్, గురువు మరియు వేదసాక్షి

పునీత లూయీ గ్రిన్యోన్ దె మోన్‌ఫోర్, గురువు

పాస్కా కాల ప్రార్థనలు

పాస్కా కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు