తెలుగు

ధ్యానం 79: మన ధన్య వ్యాకులమాత

రంగురంగుల గాజులో శిలువ మరణ దృశ్యం, Needpix.com ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

మరియమాత తన జీవితంలో ఎన్నో కష్టాలను సహించింది.  తన రక్షకుణ్ణి అద్భుతరీతిగా గర్భం ధరించినప్పుడు ఆమె అనుమానాలను, అపహాస్యాన్ని సహించింది.  తన దివ్య కుమారుడు తిరస్కరణకు, అపార్థాలకు గురవుతుండగా ఆమె పరిపూర్ణమైన మాతృప్రేమతో చూస్తూ ఉంది.  ఆయన వేదనలోనూ మరణంలోనూ ఆయన చెంత నిలిచింది.  వీటన్నిటి మధ్య ఆమె మాతృప్రేమ పరిపూర్ణంగానూ శక్తిమంతంగానూ నిలిచింది.  జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలన్నిటిలోనూ ఆమె మనకు కూడా తోడుగా నిలుస్తుంది.  తన వాత్సల్యపూరిత హృదయం ద్వారా ప్రేమకు, కనికరానికి పరిపూర్ణ సాక్ష్యాన్ని మనకు అందిస్తుంది (చూడండి డైరీ #315).

ఈ రోజు దేవమాత హృదయాన్ని ధ్యానించండి.  యేసు నిజమైన తల్లి అయిన మీ ధన్యమాత తన కుమారుని జీవితమంతటా ఆయనను ఎలా ప్రేమించిందో ధ్యానించండి.  లెక్కలేనన్ని సార్లు ఆమె హృదయాన్ని ఛేదించిన దుఃఖ ఖడ్గాన్ని ఊహించండి.  తన కుమారుణ్ణీ, ఆయనపట్ల అంత క్రూరంగా ప్రవర్తించినవారినీ ఆమె ప్రేమించిన పరిపూర్ణమైన, వాత్సల్యపూరితమైన ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.  ఆమె ప్రేమను అనుకరించేందుకు ఈ రోజు ఆమె ప్రార్థనల సహాయాన్ని వేడుకోండి; ఆ ప్రేమను మీపై కురిపించమని ఆమెను అడగండి.  ఆమె మిమ్మల్ని నిరాశపరచదు.

అత్యంత ప్రియమైన మాతా, నా రాణీ, దయచేసి నా కొరకు ప్రార్థించి, నీ మాతృసంరక్షణను తెలుసుకోవడానికి నాకు సహాయం చేయుము.  నీ నిర్మల హృదయం నుండి ప్రవహించే కారుణ్య సమృద్ధిని నేను పొందేలా, అన్ని విషయాలలోనూ నిన్ను ఆశ్రయించడానికి నాకు సహాయం చేయుము.  నీ దయను, వాత్సల్యాన్ని అనుకరించడానికి, అవసరంలో ఉన్న వారందరికీ తోడుగా నిలవడానికి నాకు కృపను ప్రసాదించుము.  మరియమాతా, మా కొరకు ప్రార్థించుము.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ఇరవై ఏడవ రోజు ధ్యానాలు:
ఎడారిలో 40 రోజులు & సిలువ చెంత 40 రోజులు

తపస్సుకాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

తపస్సుకాలానికి ఉపయోగకరమైన వనరులు

నేటి పునీతులు/పండుగలు