తెలుగు

ధ్యానం 249: బాధల ఫలం

చిత్రం Needpix.com ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

ఎంతో బాధను అనుభవించిన తరువాతే, అటువంటి బాధల నుండి కలగగల మంచి ఫలాలను అర్థం చేసుకోవడం మొదలవుతుంది. బాధ అనేది స్వతహాగా పతనమైన మన మానవ స్థితి ఫలితం. అయితే యేసు మన మానవ స్థితిలోకి ప్రవేశించి, సమస్త బాధలనూ స్వీకరించి, వాటిని విమోచించారు కాబట్టి, ఇప్పుడు మనం బాధలను స్వేచ్ఛగా స్వీకరించి క్రీస్తు బాధలతో ఐక్యం చేసినప్పుడు వాటికి గొప్ప శక్తి ఉంటుంది. బాధల నుండి కలగగల మంచి ఫలాలలో ఒకటి ఆధ్యాత్మిక జ్ఞానం. క్రీస్తులో బాధలను స్వీకరించి, ఆయన స్వీయ బలితో ఐక్యం చేసి, ఆయనకు బలిగా అర్పించినప్పుడు, మన బాధలు జీవితాన్ని స్పష్టంగా అర్థం చేసుకునేలా చేసి, దానిని సరైన దృక్పథంతో చూడటానికి తోడ్పడతాయని మనం గ్రహిస్తాము. అంతేకాక, మనకు ఎదురయ్యే ఇతరుల ఆత్మలను లోతుగా అర్థం చేసుకునే ఆధ్యాత్మిక వరాన్ని కూడా అవి మనకు ఇవ్వవచ్చు. ఇతరుల ఆత్మలను గురించిన ఈ జ్ఞానవరం వారి అవసరాలను గుర్తించి, వారికి అవసరమైన నిర్దిష్ట రీతిలో దేవుని కారుణ్యాన్ని అందించడానికి మనకు తోడ్పడుతుంది. మీ బాధలు మిమ్మల్ని రూపాంతరం చెంది౦చి, దేవుడు మీకు ప్రసాదించాలనుకునే అనేక ఇతర వరాలతోపాటు ఈ జ్ఞానవరాన్ని కూడా మీకు అందించడానికి అనుమతించేందుకు భయపడకండి (చూడండి దినచర్య #1277).

మీ బాధలను మీరు ఎలా ఎదుర్కొంటున్నారో ధ్యానించండి. మీరు అనుభవించేది స్వల్పమైన అసౌకర్యమైనా, తీవ్రమైన అంతరంగ వేదనైనా, జీవితంలో మనం అనుభవించే ప్రతిదీ మనల్ని రూపాంతరం చెందించేలా విమోచించబడి, రూపాంతరం చెందగలదు. మీరు దీనిని విశ్వసిస్తే, మీరు భరించే ప్రతి అసౌకర్యాన్ని, ప్రతి బాధను దేవునికి అర్పించే బలిగా ఉద్దేశపూర్వకంగా స్వీకరించడానికి ప్రయత్నించండి. దానిని ఆయనకు అర్పించండి. ఆ తరువాత, ఇలా స్వేచ్ఛగా స్వీకరించడం వల్ల కలిగే శుద్ధీకరణ ప్రభావాలు మీ జీవితంలో సమృద్ధిగా మంచి ఫలాలను పండించడానికి అనుమతించండి.

ప్రభువా, నేను ఎంతో తరచుగా నా బాధల నుండి పారిపోతున్నాను. నా బాధలను స్వేచ్ఛగా స్వీకరించడం నాపై చూపగల విమోచన ప్రభావాలను నిరాకరిస్తున్నాను. నాకు ఇవ్వబడిన సిలువలకు “అవును” అని చెప్పడానికి, అవి నా జీవితంలో పండించగల ఆధ్యాత్మిక ఫలాలను స్వీకరించడానికి నాకు ధైర్యాన్ని ప్రసాదించు. ప్రియమైన ప్రభువా, సమస్తాన్నీ నీకు సమర్పిస్తున్నాను. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు