తెలుగు

ధ్యానం 269: కారుణ్యం, దైన్యం రెండింటిపైనా దృష్టి

దృష్టి నిలపడానికి మీరు రెండు విషయాలను ఎంచుకోగలిగితే, అవి ఏవై ఉంటాయి?  నిజానికి, దృష్టి నిలపవలసిన అత్యంత ముఖ్యమైన రెండు విషయాలు దేవుని కారుణ్యం, మీ సొంత దైన్యం.  దృష్టి నిలపవలసిన అత్యంత ముఖ్యమైన విషయాలలో దేవుని కారుణ్యం ఒకటని మీకు వెంటనే అర్థమవుతుంది…

ధ్యానం 268: మరణాన్ని గురించి ఆలోచించడం

బహుశా మీ మరణాన్ని గురించి ఆలోచించడం భయం కలిగించవచ్చు. వాస్తవానికి మీరు దాని గురించి తరచుగా ఆలోచించకపోవచ్చు. కానీ తన మరణాన్ని నేరుగా, సంపూర్ణ నమ్మకంతో చూడగలగడం ఒక అనుగ్రహం. మీ జీవితం సక్రమంగా ఉన్నప్పుడే సంపూర్ణ నమ్మకంతో అలా చేయడం సాధ్యమవుతుంది…

ధ్యానం 267: న్యాయమా, కరుణా?

దేవుని న్యాయం గురించీ, ఆయన కరుణ గురించీ మాట్లాడటం సముచితమే.  అవి ఒకదానికొకటి విరుద్ధమైనవి కావు.  దేవునికి సేవ చేయడానికి నిరాకరించిన దూతలపై ఆయన న్యాయతీర్పు అమలైనట్లే, పశ్చాత్తాపపడటానికి నిరాకరించేవారిపై కూడా అది అమలవుతుంది.  అయితే, ప్రస్తుతానికి దేవుడు కరుణామయుడు అని చెప్పడమే మరింత సముచితం.  నిజానికి…

ధ్యానం 262: ప్రేమ పాలన లేదా న్యాయ పాలన

మనం దేవుని హస్తం నుండి తప్పించుకోలేము.  విశ్వాన్ని పోషిస్తూ, సమస్తాన్ని ఉనికిలో నిలిపి ఉంచేది ఆయనే.  ఆయన నిరంతర సంరక్షణ లేకపోతే మన ఉనికి అంతమైపోతుంది.  అయితే మనం రెండు విధానాల్లో ఏదో ఒక విధంగా ఆయన పరిరక్షణ హస్తం క్రింద ఉంటాము.  మనం “ప్రేమ పాలన” ద్వారా గానీ, “న్యాయ పాలన” ద్వారా గానీ నడిపించబడతాము.  ఆ…

ధ్యానం 259: వినయముగల ఆత్మ సౌందర్యం

ఒక వ్యక్తికి సౌందర్యాన్ని ఇచ్చేది ఏమిటి?  అన్నిటికంటే ఎక్కువగా అది వినయం అనే సద్గుణమే.  వినయం అసాధారణంగా ఆకర్షిస్తుంది.  వినయముగల ఆత్మ మొదట్లో కొందరిని అంతగా ఆకట్టుకోకపోవచ్చు. అయినా కాలక్రమేణా, అత్యంత అహంకారంతో, స్వార్థంతో నిండిన వ్యక్తిని సైతం వినయం తనవైపు ఆకర్షిస్తుంది.  అది…

ధ్యానం 257: దేవుని దీర్ఘకాల ప్రణాళిక

మీరు పూర్ణహృదయంతో మన ప్రభువును సేవించడానికి ప్రయత్నించినప్పుడు, ప్రతిరోజూ తన చిత్తం గురించి ఆయన మీతో మాట్లాడుతున్నట్లు మీరు గ్రహించవచ్చు. అది పూర్తిగా స్పష్టంగా లేకపోయినా, మీరు ఇది లేదా అది చేయాలని ఆయన కోరుతున్నట్లు మీకు అనిపించవచ్చు. సాధారణంగా దేవుడు మీ జీవితం కోసం తనకున్న ప్రణాళికనంతటినీ మీ ముందు అంతా…

ధ్యానం 255: పాపం అనే “ఆశీర్వాదం”

ఇది అసాధారణమైన శీర్షికలా అనిపించవచ్చు. పాపం “ఆశీర్వాదం” ఎలా అవుతుంది? నిజమే, కచ్చితంగా చెప్పాలంటే పాపం దేవునికి వ్యతిరేకంగా చేసే అపరాధం; అది మనలను దేవుని నుండి వేరుచేస్తుంది. కాబట్టి, కచ్చితమైన అర్థంలో పాపం ఆశీర్వాదం కాదు. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు; ఆయన ప్రతిదానినీ తన మహిమ కొరకు ఉపయోగించగలడు…

ధ్యానం 248: అపరిమిత వనరులు

అతి కొద్దిపాటి ప్రాణవాయువును అపరిమితమైన శక్తిగా మార్చే యంత్రాన్ని తయారుచేసి, అపరిమిత సహజ వనరులకు ఒక మూలాన్ని మీరు కనుగొన్నారని ఊహించుకోండి. మీరు చేయవలసిందల్లా మీరు తయారుచేసిన యంత్రాన్ని ఆన్ చేయడమే; అప్పుడు శక్తి ఉత్పత్తి అవుతుంది…

ధ్యానం 247: అవసరాల్లో ఉన్నవారి ద్వారా లభించే ఆశీర్వాదం

మీ కుటుంబంలో ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో ఉన్నా, చెరసాలలో ఉన్నా, లేదా ఏదైనా తీవ్రమైన అవసరంలో ఉన్నా, అది మీకు భారంగా ఉంటుందా లేక ఆశీర్వాదంగా ఉంటుందా?  దీని గురించి ఆలోచించండి.  ప్రత్యేక అవసరాలు ఉన్నవారు మీ జీవితాన్ని మరింత కష్టతరం చేస్తున్నారా?  పూర్తిగా ఆచరణాత్మక స్థాయిలో ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తే, ఆ…

ధ్యానం 245: వాయిదా పడిన కాఠిన్యం

ఇక్కడే, ఇప్పుడే తన న్యాయాన్ని అమలు చేసే పూర్తి హక్కు యేసుకు ఉందని తెలుసుకోవడం ముఖ్యం.  మన పాపాల కారణంగా మనపట్ల కఠినంగా వ్యవహరించడానికీ, మనపై నిత్య తీర్పు విధించడానికీ ఆయనకు పూర్తి హక్కు ఉంది.  ఆయన కారుణ్యం కారణంగా మనం తరచూ ఈ సత్యాన్ని మరచిపోతుంటాము.  కానీ…