తెలుగు

ధ్యానం 260: చిన్న ప్రేమకార్యాల గొప్పతనం

ఈ లోకంలో అద్భుతమైన కార్యాలు చేయాలని మీరు కోరుకుంటున్నారా? కొన్నిసార్లు మీకు ఎంతో గొప్ప ఆలోచనలు, కలలు ఉంటాయా? కొన్నిసార్లు మనకు సంపద, కీర్తి గురించి మరింత లౌకికమైన కలలు ఉంటాయి. మరికొన్నిసార్లు దేవుని కోసం, కతోలిక సభ కోసం అసాధారణ కార్యాలు చేయాలనే కలలు ఉండవచ్చు. కానీ ఇవి కలలుగానే మిగిలిపోనవసరం లేదు…

ధ్యానం 259: వినయముగల ఆత్మ సౌందర్యం

ఒక వ్యక్తికి సౌందర్యాన్ని ఇచ్చేది ఏమిటి?  అన్నిటికంటే ఎక్కువగా అది వినయం అనే సద్గుణమే.  వినయం అసాధారణంగా ఆకర్షిస్తుంది.  వినయముగల ఆత్మ మొదట్లో కొందరిని అంతగా ఆకట్టుకోకపోవచ్చు. అయినా కాలక్రమేణా, అత్యంత అహంకారంతో, స్వార్థంతో నిండిన వ్యక్తిని సైతం వినయం తనవైపు ఆకర్షిస్తుంది.  అది…

ధ్యానం 253: సంపూర్ణ కృతజ్ఞతతో కూడిన ప్రతిస్పందన

దేవునికి మన ప్రతిస్పందన ఎలా ఉండాలి? దేవునితో మన సంబంధంలో తరచుగా మన గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. మన కష్టాలు, అవసరాలపైనే దృష్టి పెడతాం. వీటిని దేవునికి అప్పగించి, వదిలిపెట్టాలి. మనం ఇలా చేసినప్పుడు, దేవుని మహిమను, మంచితనాన్ని చూడటం మొదలుపెడుతున్నామని తెలుసుకుంటాం…

ధ్యానం 250: నేలపై సాష్టాంగపడి ప్రార్థించడం

మీరు ప్రార్థించేటప్పుడు మన ప్రభువు చెంతకు ఎలా వెళ్తారు? ప్రేమపూర్వక భక్తితో మీ రోజంతటినీ ఆయనకు సమర్పించడం, రోజంతా మీ అత్యంత సన్నిహిత మిత్రునితో మాట్లాడినట్లుగా ఆయనతో మాట్లాడడం నిశ్చయంగా మంచిదే. అయితే మన ప్రార్థన గాఢంగా ఉండవలసిన, ఆ గాఢతను వ్యక్తపరచవలసిన ఇతర సమయాలూ ఉంటాయి…

ధ్యానం 247: అవసరాల్లో ఉన్నవారి ద్వారా లభించే ఆశీర్వాదం

మీ కుటుంబంలో ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో ఉన్నా, చెరసాలలో ఉన్నా, లేదా ఏదైనా తీవ్రమైన అవసరంలో ఉన్నా, అది మీకు భారంగా ఉంటుందా లేక ఆశీర్వాదంగా ఉంటుందా?  దీని గురించి ఆలోచించండి.  ప్రత్యేక అవసరాలు ఉన్నవారు మీ జీవితాన్ని మరింత కష్టతరం చేస్తున్నారా?  పూర్తిగా ఆచరణాత్మక స్థాయిలో ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తే, ఆ…

ధ్యానం 246: దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించిన తరువాత

దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించిన తరువాత మీరు ఏమి చేస్తారు? మనసు ఎటో తిరుగుతుండగా, చుట్టూ ఉన్నవారిని గమనిస్తూ, నిజమైన ఆధ్యాత్మిక స్థాయిలో మన ప్రభువును కలుసుకోకుండానే, పరధ్యానంతో మీ ఆసనానికి తిరిగి వెళ్తారా? లేక ఆ క్షణాన్ని నిజమైన ప్రార్థనకు, సహవాసానికి ఒక క్షణంగా మారనిస్తారా…

ధ్యానం 243: తాను ప్రేమించేవారికి యేసు ఇచ్చే ప్రత్యేక వరం

మీరు ప్రేమించే వారితో ఎలా వ్యవహరిస్తారు?  సాధారణంగా, మన కుటుంబ సభ్యులకు లేదా ఎంతో సన్నిహితులైన స్నేహితులకు ఏది అత్యుత్తమమో, ఏది వారికి సంతోషాన్ని ఇస్తుందో దానినే మనం కోరుకుంటాం.  దేవుడు కూడా మనలో ప్రతి ఒక్కరికీ అదే కోరుకుంటారు, కానీ దేవుడు దేనిని ఎలా చూస్తారో తెలిసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగవచ్చు…

ధ్యానం 240: జీవితంలో తీపా, చేదా?

మీ జీవితంలో మీరు దేనిని కోరుకుంటారు? ప్రతిరోజూ ఇంద్రియాలకు తీపిని కలిగించే అనుభవాలనా, చేదును కలిగించే అనుభవాలనా? మరో మాటలో చెప్పాలంటే, మీ దైనందిన జీవితంలోని అనేక అంశాలలో ఆనందించాలని కోరుకుంటున్నారా, లేక మీరు నెరవేర్చే దైనందిన కర్తవ్యం మీలో ఒక రకమైన చేదును మిగల్చాలని…

ధ్యానం 239: కారుణ్యపు ముద్ర

ప్రతి గొప్ప పునీతుని జీవితం దేవుని మంచితనంలోని ఏదో ఒక అంశానికి నిదర్శనంగా నిలుస్తుంది.  కొందరు లౌకిక సంపదల పట్ల అసాధారణమైన అనాసక్తితో జీవిస్తారు, కొందరు అచంచలమైన నిబద్ధతతో పేదలకు సేవ చేస్తారు, కొందరు గాఢమైన ప్రార్థనా జీవితం గడుపుతారు, కొందరు ఆధ్యాత్మిక రహస్యాల వెల్లడి పొందుతారు, కొందరు సంపుటాల కొద్దీ…

ధ్యానం 237: విశ్వాసపు అంధకారం మన ప్రేమను శుద్ధి చేస్తుంది

పునీత ఫౌస్టీనాతో సహా అనేకమంది గొప్ప పునీతులు దేవునితో తమ అనుబంధంలో అంతరంగ అంధకారాన్ని అనుభవించారు.  ఇది ఎంతో నిగూఢమైన అనుభవం.  ఒక ఆత్మ దేవునికి మరింత సన్నిహితమవుతున్న కొద్దీ, ఆ మార్గంలో ఎన్నో ఓదార్పులు, ప్రేమానుభూతులు…