తెలుగు

ధ్యానం 126: బిడ్డకు సహజమైన భయం – మేలైన భయం

మీ జీవితంలో భయం ఉందా? కొన్ని రకాల భయం ఒక విధమైన గర్వం నుంచి పుట్టి ఎంతో హానికరంగా ఉంటాయని, మరొక రకమైన భయం దేవునిపట్ల మీకున్న గాఢమైన ప్రేమ నుంచి కలిగి ఎంతో మేలు చేస్తుందని తెలుసుకోవడం ముఖ్యం. “పవిత్రమైన భయం” అంటే బిడ్డకు సహజమైన భయం, అనగా దేవుని బిడ్డకు ఉండే భయం. ఈ…

ధ్యానం 98: ఒక సాధనంగా ఉండటం

ఏదైనా కార్యాన్ని నెరవేర్చమని దేవుడు మనల్ని పిలిచినప్పుడు, పనిచేస్తున్నది ఎవరు?  దేవుడా, మనమా?  నిజానికి ఇద్దరమూ పనిచేస్తున్నాం; దేవుడు మూలం, మనం సాధనం.  మనం స్వేచ్ఛాసంకల్పంతో ప్రయత్నిస్తాం, కానీ మన ద్వారా ప్రకాశించేది దేవుడే.  ఒక కిటికీ వెలుగుకు మూలంగా పనిచేయగలిగినట్లే…

ధ్యానం 96: మీ కోసం దేవుడు కలిగియున్న మహత్తర ప్రణాళిక

మనందరికీ కొన్నిసార్లు గొప్ప స్థాయికి చేరుకోవాలనే కలలు కలగవచ్చు. నాకు సంపద, పేరు ప్రఖ్యాతులు ఉంటే ఎలా ఉంటుంది? ఈ లోకంలో నాకు గొప్ప అధికారం ఉంటే ఎలా ఉంటుంది? నేను పోప్‌గానో దేశాధ్యక్ష పదవిలోనో ఉంటే ఎలా ఉంటుంది? అయితే ఒక విషయంలో మనం నిశ్చయంగా ఉండవచ్చు: దేవుడు మన కోసం నిజంగానే గొప్ప విషయాలను తలపోస్తున్నాడు. ఆయన మనల్ని ఒక గొప్పతనానికి పిలుస్తున్నాడు…

ధ్యానం 88: రూపాంతరం చెందిన ఆంతరంగిక బాధ

అనేకమంది తమ ఆత్మల్లో ఎంతో భారమైన బరువులను మోస్తుంటారు. బయటికి వారు ఆనందంతో, శాంతితో వెలిగిపోతున్నట్లు కనిపించవచ్చు. కానీ వారి ఆత్మల్లో తీవ్రమైన బాధ కూడా ఉండవచ్చు. మనం క్రీస్తును అనుసరిస్తున్నప్పుడు, మన ఆంతరంగిక జీవితానికి, బాహ్య జీవితానికి సంబంధించిన ఈ రెండు అనుభవాలు పరస్పర విరుద్ధమైనవి కావు. తరచుగా…

ధ్యానం 82: మమకారాలు

జీవితంలో మనం మమకారం పెంచుకోగల విషయాలు ఎన్నో ఉన్నాయి.  కొన్నిసార్లు మంచి విషయాలపై కూడా మమకారం పెంచుకోవచ్చు.  చాలా తరచుగా మనం అంటిపెట్టుకునేది మన సొంత మొండి సంకల్పాన్నే.  మనకు కావలసినది మనకు కావలసినప్పుడే కావాలని కోరుకుంటాం.  యథార్థమైన…

ధ్యానం 67: ప్రేమ యొక్క గుప్త గులాబీలు

కొన్ని ప్రేమచర్యలు ప్రేమించుకునే ఇద్దరి మధ్య మాత్రమే పంచుకోవడానికి ఉద్దేశించినవి. అత్యంత సాన్నిహిత్యంతో, ఆత్మార్పణతో చేసే కార్యాలు ప్రేమబంధంలోని ఏకాంతంలో పంచుకునే అమూల్యమైన ప్రేమకానుకలు. దేవునిపట్ల మన ప్రేమ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. మన అత్యంత గాఢమైన ప్రేమను వ్యక్తపరచే మార్గాలను మనం క్రమం తప్పకుండా వెదకాలి…

ధ్యానం 65: నా యజమాని యేసు

యేసును మీ యజమాని అని పిలవడానికి మీకు సంకోచం లేదా?  కొందరు ఆయనను “స్నేహితుడు” లేదా “కాపరి” అని పిలవడానికి ఇష్టపడవచ్చు.  ఈ పేర్లు నిజమైనవే.  కానీ యజమాని అని పిలవడం సంగతేమిటి?  మనమందరం మన జీవితాలకు యజమానిగా మన ప్రభువును అంగీకరించి, మనల్ని మనం ఆయనకు సమర్పించుకునే స్థితికి చేరుకోవాలి.  మనం కేవలం సేవకులుగా మారడమే కాదు…

ధ్యానం 20: ప్రతిరోజూ మీ జీవితాన్ని యేసుకు సమర్పించండి

యేసు మిమ్మల్ని స్వీకరించి, మీ ఆత్మను తన సొంతం చేసుకున్న తరువాత, ఇకముందు ఏమి జరుగుతుందోనని చింతించకండి. జీవితం వెంటనే అనూహ్యంగా మారిపోతుందని ఆశించకండి; అయితే అలా మారినా ఆశ్చర్యపోకండి. ముఖ్యమైనదల్లా, ప్రతిరోజూ మిమ్మల్ని మీరు ఆయన…

ధ్యానం 19: ప్రభువు తన కారుణ్యంతో మిమ్మల్ని స్వీకరిస్తారు

మీరు నిజంగా మన దివ్య ప్రభువును వెదకినట్లయితే, తన హృదయంలోకి, తన పవిత్ర చిత్తంలోకి మిమ్మల్ని స్వీకరిస్తారా అని ఆయనను అడగండి.  ఆయనను అడిగి, ఆయన మాట వినండి.  మీరు సమస్తాన్నీ సమర్పించి, మిమ్మల్ని మీరు ఆయనకు అర్పించుకున్నట్లయితే, మిమ్మల్ని స్వీకరిస్తున్నానని చెబుతూ ఆయన మీకు జవాబిస్తారు.  ఒకసారి…

ధ్యానం 16: దేవునికి సంపూర్ణ ఆత్మసమర్పణ

దేవుని ముందు మోకరిల్లండి. ఆయన ముందు సాష్టాంగపడండి. సాధ్యమైతే, నిజంగానే అలా చేయండి. అది ఇతరుల ఏకాగ్రతకు భంగం కలిగిస్తే, అంతరంగంలో అలా చేయండి. దేవుని ముందు సాష్టాంగపడి, తన దైవకారుణ్యాన్ని, తన పరమ పవిత్ర చిత్తాన్ని మీకు తెలియజేయమని ఆయనను వేడుకోండి. జీవితంలో ఎన్నో సందర్భాలలో…