రెంబ్రాంట్ చిత్రించిన ధనవంతుడైన మూర్ఖుని ఉపమానం
ఆంగ్లంలో వినండి
జీవితంలో మనం మమకారం పెంచుకోగల విషయాలు ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు మంచి విషయాలపై కూడా మమకారం పెంచుకోవచ్చు. చాలా తరచుగా మనం అంటిపెట్టుకునేది మన సొంత మొండి సంకల్పాన్నే. మనకు కావలసినది మనకు కావలసినప్పుడే కావాలని కోరుకుంటాం. యథార్థమైన పవిత్రతకు ఒక కీలక మార్గం దేవునినీ, ఆయన పవిత్ర చిత్తాన్నీ తప్ప మిగిలిన ప్రతిదానిపట్ల మమకారాన్ని విడిచిపెట్టడానికి కృషి చేయడం. ఇందుకోసం మన జీవితాల్లో ఎన్నో విషయాలను “విడిచిపెట్టడం”, ఎంతో సమర్పణ అవసరం (చూడండి దినచర్య గ్రంథం #338).
మీరు దేనిపై మమకారం పెంచుకున్నారు? ముందుగా మీ మనసులో ఏమి మెదులుతోంది? మీరు దేనిని విడిచిపెట్టడానికి ఇష్టపడరు? జీవితంలోని మంచి విషయాలపై మమకారం కూడా దేవునికంటే సృష్టిలోని వాటిపైనే ఎక్కువ నమ్మకం ఉంచే ఒక విధానం. నిజానికి, దేవుణ్ణి అయినా, కుటుంబ సభ్యులను అయినా, స్నేహితులను అయినా, మరెవరినైనా నిజాయితీగా ప్రేమించడానికి ఒకే మార్గం మీ స్వార్థపూరిత మమకారాలను విడిచిపెట్టడమే. అప్పుడు దేవుని ప్రేమ మిమ్మల్ని నింపి, మీ ద్వారా ఇతరులను ఆయన పవిత్రమైన, పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించగలుగుతుంది.
ప్రభువా, నీకు సంబంధించినవి కానివన్నీ విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయుము. ముఖ్యంగా, నా పాపాన్ని గుర్తించి, దానిని నీకు అప్పగించడానికి నాకు సహాయం చేయుము. నీ హృదయంతో నా కుటుంబ సభ్యులను ప్రేమించే స్వేచ్ఛ నాకు కలిగేలా, వారిపట్ల కూడా మమకారాన్ని పవిత్రమైన రీతిలో విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయుము. నా ప్రభువా, నీవే నా ఏకైక లక్ష్యమూ, ప్రేమయై ఉండుము. ఈ ప్రేమలో, నీ హృదయంతో ప్రతి ఒక్కరినీ ఎలా ప్రేమించాలో నేను తెలుసుకొందును గాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
ఇరవై తొమ్మిదవ రోజు ధ్యానాలు:
ఎడారిలో 40 రోజులు & సిలువ చెంత 40 రోజులు
మార్చి 23 – మొగ్రోవెహోకు చెందిన పునీత తురిబియస్, బిషప్పు
తపస్సుకాలానికి ఉపయోగకరమైన వనరులు
తపస్సుకాలానికి ఉపయోగకరమైన వనరులు
తపస్సుకాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




