పునీత బెర్నార్డును ఆలింగనం చేసుకుంటున్న క్రీస్తు — ఫ్రాన్సెస్క్ రిబాల్టా చిత్రకృతి
ప్రధాన చిత్రం: Pixabay నుండి సిస్టర్ ఎం. యుట్టా
ఆంగ్లంలో వినండి
కొన్ని ప్రేమచర్యలు ప్రేమించుకునే ఇద్దరి మధ్య మాత్రమే పంచుకోవడానికి ఉద్దేశించినవి. అత్యంత సాన్నిహిత్యంతో, ఆత్మార్పణతో చేసే కార్యాలు ప్రేమబంధంలోని ఏకాంతంలో పంచుకునే అమూల్యమైన ప్రేమకానుకలు. దేవునిపట్ల మన ప్రేమ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. దేవునిపట్ల మనకున్న అత్యంత గాఢమైన ప్రేమను ఆయనకు మాత్రమే తెలిసే విధంగా వ్యక్తపరచే మార్గాలను మనం క్రమం తప్పకుండా వెదకాలి. ప్రతిగా, దేవుడు మనకు మాత్రమే తెలిసేలా మన అంతరంగంలో కారుణ్యానుగ్రహాలను సమృద్ధిగా కురిపిస్తాడు. ఈ పరస్పర ప్రేమ వినిమయాలు ఆత్మను శక్తిమంతంగా రూపాంతరం చేస్తాయి; అవి అత్యున్నత ఆనందానికి మూలం (చూడండి: డైరీ #239).
మన కరుణామయుడైన దేవునితో మీ బంధంలోని సాన్నిహిత్యాన్ని గురించి ఈ రోజు ధ్యానించండి. మీ ప్రేమను ఆయనపై కురిపించడంలో మీరు ఎంతో ఆనందం పొందుతున్నారా? మీ హృదయాంతరంగంలో క్రమం తప్పకుండా అలా చేస్తున్నారా. దేవుడు ఈ ప్రేమానుగ్రహాలను మీపై కురిపించే లెక్కలేనన్ని మార్గాలను స్వీకరించడానికి మీ హృదయాన్ని తెరుస్తున్నారా?
ప్రభువా, నీపై ప్రేమతో నా అంతరంగంలో చేసే కార్యాలు నీ దివ్య హృదయం ముందు నేను ఉంచే గులాబీలా ఉండునుగాక. నా ప్రేమను నీకు అర్పించడంలో నేను ఆనందించుదునుగాక. నీవు నీ ప్రేమను నాపై సమృద్ధిగా కురిపించే రహస్యమైన, గాఢమైన మార్గాలలో నేను ఎల్లప్పుడూ సంతోషించుదునుగాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
తపస్సుకాల మూడవ ఆదివారానికి ధ్యానం:
ఎడారిలో 40 రోజులు
తపస్సుకాలానికి ఉపయోగకరమైన వనరులు
తపస్సుకాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు
మార్చి 8 – నేటి పునీతులు – పునీత దేవుని యోహాను, మఠజీవి
ఈ సంవత్సరం ఆదివారం నాడు వస్తున్నందున ఆరాధన క్రమంలో స్మృతిదినంగా జరుపుకోరు




