బర్తొలోమే ఎస్తెబాన్ మురిల్లో, సార్వజనిక వినియోగంలో ఉన్న కృతి, వికీమీడియా కామన్స్ ద్వారా
ఆంగ్లంలో వినండి
ఇతరులకు సేవచేయగల సామర్థ్యం మనకు లభించిన అత్యంత గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి. మనం వారికి అనేక విధాలుగా, ముఖ్యంగా మన ప్రత్యేక పిలుపునకు అనుగుణంగా సేవచేస్తాము. అయితే ఒక వ్యక్తికి మనం చేయగల అత్యంత గొప్ప సేవ ఏమిటంటే, దేవుని కరుణకు సేవకులమై, వారిని పరలోక మహిమల వైపు నడిపించడం. దేవుని పట్ల ప్రేమలో ఎదగడానికి మీరు లెక్కలేనన్ని ఆత్మలకు ప్రేరణనిచ్చారని తెలుసుకున్నప్పుడు పరలోక అనుభవం ఎలా ఉంటుందో ఊహించండి. దీనిని మీ జీవితంలోని అత్యంత గొప్ప ఆశీర్వాదాలలో, విశేషాధికారాలలో ఒకటిగా భావించండి (చూడండి: దినచర్య #1622).
మన దేవుని సత్యాన్ని, ప్రేమను, కనికరాన్ని ఇతరులకు అందించడానికి మీరు ఎంతగా తపిస్తున్నారు? ఇది ఎంత గొప్ప గౌరవమో, ఇది మీకు ఎంత గొప్ప గౌరవనీయతను ప్రసాదిస్తుందో మీరు గ్రహిస్తున్నారా? జీవితంలో అత్యంత ప్రాధాన్యమివ్వవలసిన వాటిలో దీనిని ఒకటిగా చేసుకోవడం ఎంత ముఖ్యమో ఎన్నడూ సందేహించకండి. మీ సర్వస్వంతో దేవుణ్ణి ప్రేమించడం మొదటి స్థానంలో ఉంటుంది; అయితే ఇతరులకు సేవచేయడం, రక్షణ మార్గంలో వారికి సహాయపడడం దాని వెనువెంటనే ఉంటాయి. ఈ మహిమాన్వితమైన కరుణాకార్యానికి ఈ రోజే మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి; అలా చేసినందుకు మీరు నిత్యమూ కృతజ్ఞులై ఉంటారు.
ప్రభువా, పూర్ణహృదయంతో ఇతరులకు సేవచేయాలనే కోరికను, సంకల్పాన్ని నాకు దయచేయి. వారిని ప్రేమించడానికి, వారి జీవితాలలోకి నీ కరుణను, కనికరాన్ని తీసుకురావడానికి నాకు సహాయపడు. ప్రియ ప్రభువా, నా జీవితం ద్వారా నీవు వారికి అందించే కృపవల్ల అనేక ఆత్మలు నీవైపు ఆకర్షితమై నీవి అగుగాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
కృతజ్ఞతార్పణగా విరాళం ఇవ్వడాన్ని పరిశీలిస్తారా?
మరియమాత ఆదిపాపరహిత గర్భధారణ నవదిన ప్రార్థన
నవంబర్ 29-డిసెంబర్ 7
పునీత అంద్రేయ క్రిస్మస్ నవదిన ప్రార్థన
పునీత అంద్రేయ క్రిస్మస్ నవదిన ప్రార్థనను సాంప్రదాయంగా పునీత అంద్రేయ పండుగ అయిన నవంబర్ 30 నుండి క్రిస్మస్ ముందు రోజు వరకు ప్రతిరోజూ 15 సార్లు ప్రార్థిస్తారు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




