చిత్రం: getty.edu ద్వారా
ఆంగ్లంలో వినండి
మిమ్మల్ని హింసించేవారి కోసం ప్రార్థించడం, వారితో అత్యంత గౌరవంతోను కనికరంతోను వ్యవహరించడం జీవితంలో అత్యంత కష్టమైన పనులలో ఒకటి. అయితే వారిని ద్వేషించడం వల్ల గానీ, వారిపై విరుచుకుపడటం వల్ల గానీ ప్రయోజనం ఏమిటి? వారికి ఈ విధంగా “హాని” చేయడం వల్ల వారి ఆత్మకన్నా మీ ఆత్మకే ఎంతో ఎక్కువ నష్టం కలుగుతుంది. క్షమించండి, క్షమించండి, మళ్లీ క్షమించండి. నిజానికి, మరొకరిని క్షమించడం దేవుని న్యాయానికి ఒక రూపం. ఎందుకంటే అది ఆ వ్యక్తికి క్షమాపణ అవసరమని వెల్లడిస్తుంది; మీ జీవితంలో వారి దురుద్దేశం చూపే దుష్ట ప్రభావాన్ని తొలగిస్తుంది. వారిని క్షమించండి, వారి కోసం ప్రార్థించండి, వారిని దేవుని కారుణ్యానికి అప్పగించండి. ఇలా చేయడం ద్వారా మీ ఆత్మలో గొప్ప శాంతిని పొందుతారు (చూడండి డైరీ #1628).
మీ జీవితంలో మీరు ద్వేషించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? లేదా ఎవరి పట్లనైనా కనీసం తీవ్రమైన కోపం పెంచుకోవాలనే శోధనకు లోనవుతున్నారా? అలా అయితే, ఈ రోజు ఆ వ్యక్తి గురించి ఆలోచించి, వారిని క్షమించాలని స్పృహతో నిర్ణయించుకోండి. మీ భావాలు వెంటనే ఈ నిర్ణయానికి అనుగుణంగా మారకపోయినా, ఈ నిర్ణయంలో మీరు శాంతిని పొందడం ప్రారంభిస్తారు. కోపం ఉన్నంతకాలం వారిని మళ్లీ మళ్లీ క్షమించండి. అప్పుడు ప్రభువు మీ జీవితంలోని ఆ దుర్గుణాన్ని తొలగించి, దాని స్థానంలో తన ఆనందాన్ని నింపుతారు.
ప్రభువా, నీ గొప్ప కారుణ్యంతో నా పాపాలను క్షమించావు. అటువంటి వరానికి నాకు అర్హత లేకపోయినా, దానికై నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇతరుల పట్ల, ముఖ్యంగా నన్ను బాధపెట్టినవారి పట్ల, అంతే గాఢమైన కారుణ్యాన్ని, కనికరాన్ని చూపడానికి నాకు సహాయం చేయి. ప్రియ ప్రభువా, నేను వారిని క్షమిస్తున్నాను. వెయ్యిసార్లు, అంతకన్నా ఎక్కువసార్లు కూడా వారిని క్షమిస్తున్నాను. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
మా ఆగమనకాల వనరులన్నింటినీ చూడండి
మరియమాత ఆదిపాపరహిత గర్భధారణ నవదిన ప్రార్థన
నవంబర్ 29-డిసెంబర్ 7
గివింగ్ ట్యూస్డే సందర్భంగా విరాళం ఇవ్వడాన్ని పరిశీలిస్తారా?
పునీత అంద్రేయ క్రిస్మస్ నవదిన ప్రార్థన
క్రింద ఇచ్చిన పునీత అంద్రేయ క్రిస్మస్ నవదిన ప్రార్థనను సాంప్రదాయంగా నవంబర్ 30న పునీత అంద్రేయ పండుగ రోజు నుండి క్రిస్మస్ ముందు రోజు వరకు రోజుకు 15 సార్లు ప్రార్థిస్తారు.
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు
నేటి పునీతులు/పండుగలు[adinserter block=”8″]




