తెలుగు

ధ్యానం 3: కారుణ్య కార్యంగా దేవదూతల సృష్టి

“సంగీత దేవదూతలు” — పీటర్ పాల్ రూబెన్స్

వీడియో

ఆంగ్లంలో వినండి

గమనిక: ధ్యానాలు 1-10 సాధారణ పరిచయాన్ని అందించేవి: పునీత ఫౌస్టీనా డైరీకి మరియు దైవకారుణ్యానికి. ధ్యానం 11 నుండి, మనం దీనిలోని విషయాలను ధ్యానించడం ప్రారంభిస్తాం; అందుకు ఆధారంగా ఉటంకించేది డైరీని. ప్రస్తుతానికి, ఈ మొదటి 10 రోజులలో, ఏడాది పొడవునా ధ్యానించబోయే ఈ నూతన భక్తి సాధనను అర్థం చేసుకోవడానికి పునాది వేసేలా ఈ చిన్న ప్రారంభ పరిచయ ధ్యానాలను ఉపయోగించుకోండి. ఈ భక్తి సాధన దైవకారుణ్యం పట్ల భక్తిని పెంపొందించేది.

భౌతిక ప్రపంచాన్ని సృష్టించడంతో పాటు, దేవుడు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కూడా శూన్యం నుండి సృష్టించాడు. దేవదూతలూ, ప్రతి మానవ ఆత్మా దేవుని నిర్మలమైన ప్రేమ నుండి లభించిన వరాలే. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించినప్పుడు, దేవుడు తెలుసుకోగల, ప్రేమించగల జీవులను సృష్టించాడు. దేవదూతల సృష్టి మానవాళిపట్ల దేవుడు చూపిన ఒక ప్రత్యేకమైన కారుణ్య కార్యం. ఎందుకంటే దేవదూతలు దేవుణ్ణి తెలుసుకొని ప్రేమించడానికి మాత్రమే కాకుండా, మానవాళిని కూడా తెలుసుకొని ప్రేమించడానికి, మానవాళిని స్వర్గపు ఉన్నత స్థాయులకు నడిపించడానికి సృష్టించబడ్డారు.

పరలోక వాసులందరూ మనకు వరంగా ఇవ్వబడ్డారనే విషయాన్ని ధ్యానిస్తూ ఈ రోజు కొంత సమయం గడపండి.  మన సంరక్షక దేవదూతలూ, పరలోక వాసులందరూ మన ఊహకు అందనంత అమూల్యమైన వరాలు.  ఈ సత్యాన్ని ఈ రోజు మీ హృదయంలో లోతుగా ఇముడ్చుకోవడానికి ప్రయత్నించండి; మీ ఆధ్యాత్మిక ఆత్మలో వారు చేస్తున్న కార్యానికి కృతజ్ఞతతో ఉండండి.

ప్రభువా, పరలోకంలోని దివ్యసేనలను వరంగా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. ఈ పరలోక వాసుల ద్వారా మానవాళిపై నీవు సమృద్ధిగా కురిపించే కారుణ్యానికి నీకు కృతజ్ఞతలు. వారి ద్వారా నాకు లభించే నీ కృపను స్వీకరించడానికి నా హృదయం ఎల్లప్పుడూ తెరిచి ఉండునుగాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ధ్యానాలు 1-10 పరిచయాన్ని చదవండి

జనవరి 3 – యేసు అతి పవిత్ర నామం—ఐచ్ఛిక స్మరణ

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు


మీరు నూతన సంవత్సరానికి సిద్ధంగా ఉన్నారా?

దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు: పునీత ఫౌస్తీనాతో 365 రోజులు ప్రారంభమైంది! దేవుని కారుణ్యపు ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న మనం, ఈ ప్రయాణంలో మాతో చేరేందుకు మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను ఆహ్వానించమని మిమ్మల్ని కోరుతున్నాము. ఈ విధంగా మాతో చేరేందుకు వారిని ఆహ్వానించండి:

  1. రోజువారీ ఈమెయిళ్ల కోసం నమోదు చేసుకోవడం ద్వారా
  2. మా దైనందిన కతోలిక ధ్యానాలు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా
  3. ప్రతిరోజూ మా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా
  4. దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు పుస్తకాన్ని పేపర్‌బ్యాక్ లేదా ఈ-పుస్తక రూపంలో కొనుగోలు చేయడం ద్వారా

ఈ నూతన సంవత్సరంలో దేవుని అపారమైన కరుణను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి!

అమెజాన్‌లో లభిస్తుంది