తెలుగు

ధ్యానం 10: దైవకారుణ్య అపొస్తలిక ఉద్యమం

జడ్జ్‌ఫ్లోరో, వికీమీడియా కామన్స్ ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

గమనిక: ధ్యానాలు 1-10 సాధారణ పరిచయాన్ని అందించేవి: పునీత ఫౌస్టీనా డైరీకి మరియు దైవకారుణ్యానికి. ధ్యానం 11 నుండి, మనం దీనిలోని విషయాలను ధ్యానించడం ప్రారంభిస్తాం; అందుకు ఆధారంగా ఉటంకించేది డైరీని. ప్రస్తుతానికి, ఈ మొదటి 10 రోజులలో, ఏడాది పొడవునా ధ్యానించబోయే ఈ నూతన భక్తి సాధనను అర్థం చేసుకోవడానికి పునాది వేసేలా ఈ చిన్న ప్రారంభ పరిచయ ధ్యానాలను ఉపయోగించుకోండి. ఈ భక్తి సాధన దైవకారుణ్యం పట్ల భక్తిని పెంపొందించేది.

పవిత్ర ఫౌస్టీనా దినచర్య వివిధ విధాలుగా ఒక నూతన భక్తి రూపానికి మనలను పిలుస్తుంది. మన వ్యక్తిగత భక్తితోపాటు, కారుణ్య అపొస్తలులుగా ఉండటానికి కూడా మనం పిలువబడ్డాము. మీరు కారుణ్య అపొస్తలులుగా ఉన్నారా? దైవకారుణ్య అపొస్తలిక ఉద్యమం అనేది తన దైవకారుణ్యాన్ని వ్యాప్తి చేసే కార్యంలో చురుకుగా పాల్గొనమని మన ప్రభువు ఇచ్చే పిలుపు. ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా, ఇతరుల పట్ల కారుణ్యంతో జీవించడం ద్వారా ఈ కార్యం జరుగుతుంది. ఇది చిన్న పని కాదు. కారుణ్యంతో జీవించడానికి, దానిని వ్యాప్తి చేయడానికి క్రీస్తు హృదయంతో సంపూర్ణ ఐక్యత అవసరం. క్రీస్తు ప్రేమకు, కారుణ్యానికి విరుద్ధమైన వాటన్నిటి నుండి మన ఆత్మలు లోతుగా శుద్ధి చేయబడటం అవసరం.

మన ప్రభువుకు అలాంటి అపొస్తలులుగా మీరు ఎంత బాగా జీవిస్తున్నారో ఈ రోజు ధ్యానించండి. మీ చుట్టూ ఉన్నవారికి ఆ కారుణ్యాన్ని మరింత సమర్థంగా అందించగలిగేలా, మీరు కారుణ్యంలో ఇంకా ఎదగవలసిన అంశాలు మీకు తప్పక తెలుస్తాయి. మరింతగా కృషి చేసి, మన లోకంలో క్రీస్తు హృదయానికి మరింత మెరుగైన సూచనగా ఉండటానికి నిబద్ధులవండి.

ప్రభువా, నీ పరమ పవిత్ర కారుణ్యానికి అపొస్తలులుగా ఉండేందుకు నన్ను పిలిచావని నాకు తెలుసు. నా మాటలలోను చేతలలోను ఈ కారుణ్యానికి సాక్ష్యమివ్వడంలో నేను తరచుగా విఫలమవుతున్నాను. ఈ అమూల్యమైన వరాన్ని అందరికీ వ్యాప్తి చేయాలనే తపనను నా ఆత్మలో పునరుద్ధరించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ధ్యానాలు 1-10కు పరిచయాన్ని చదవండి

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు