తెలుగు

ధ్యానం 9: 3 గంటల వేళ ఆయన పాడుశ్రమలను ధ్యానించడం

సిలువ మరణం — చిత్రకారుడు ఫిలిప్ దె షాంపేన్

వీడియో

ఆంగ్లంలో వినండి

గమనిక: ధ్యానాలు 1-10 సాధారణ పరిచయాన్ని అందించేవి: పునీత ఫౌస్టీనా డైరీకి మరియు దైవకారుణ్యానికి. ధ్యానం 11 నుండి, మనం దీనిలోని విషయాలను ధ్యానించడం ప్రారంభిస్తాం; అందుకు ఆధారంగా ఉటంకించేది డైరీని. ప్రస్తుతానికి, ఈ మొదటి 10 రోజులలో, ఏడాది పొడవునా ధ్యానించబోయే ఈ నూతన భక్తి సాధనను అర్థం చేసుకోవడానికి పునాది వేసేలా ఈ చిన్న ప్రారంభ పరిచయ ధ్యానాలను ఉపయోగించుకోండి. ఈ భక్తి సాధన దైవకారుణ్యం పట్ల భక్తిని పెంపొందించేది.

పునీత ఫౌస్తీనా దినచర్య మనలను వివిధ మార్గాల్లో ఒక నూతన భక్తి విధానానికి ఆహ్వానిస్తుంది.  ప్రతిరోజూ యేసు మరణించిన వేళను గౌరవించడం నాలుగవ మార్గం.

“తండ్రీ, నీ చేతుల్లో నా ఆత్మను అప్పగిస్తున్నాను!” అప్పుడు యేసు తుదిశ్వాస విడిచారు…

యేసు తుదిశ్వాస విడిచి సిలువపై మరణించింది 3 గంటలకే. అది శుక్రవారం. అందువల్ల, ఆయన పాడుశ్రమలను, పరమ బలియాగాన్ని గౌరవించడానికి శుక్రవారాన్ని ఎల్లప్పుడూ ప్రత్యేక దినంగా పరిగణించాలి. అయితే, అది 3 గంటలకు జరిగింది కాబట్టి, ప్రతిరోజూ ఆ వేళను గౌరవించడం కూడా ముఖ్యం. దైవకారుణ్య జపమాలను ప్రార్థించడానికి ఇది అత్యంత అనువైన సమయం. ఆ జపమాలను ప్రార్థించడం సాధ్యం కాకపోతే, ప్రతిరోజూ ఆ సమయంలో కనీసం కొద్దిసేపు ఆగి మన ప్రభువుకు కృతజ్ఞతలు అర్పించడం ముఖ్యం.

ప్రభువా, సిలువపై నీ పరమ బలియాగమనే వరానికి నీకు కృతజ్ఞతలు. నిన్ను నీవు సంపూర్ణంగా అర్పించుకుంటూ, నీ ప్రాణాన్ని తండ్రి చేతుల్లో అప్పగించినందుకు నీకు కృతజ్ఞతలు. రోజులోని ఆ క్షణాన్ని నేను ఎల్లప్పుడూ గౌరవించుదును గాక. ఈ పరిపూర్ణ ప్రేమబలిని అనుకరించడానికి ప్రతిరోజూ కృషి చేయుదును గాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ధ్యానాలు 1-10 పరిచయాన్ని చదవండి

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు