తెలుగు

ధ్యానం 8: దైవకారుణ్య జపమాలపై మననం

చిత్రం సౌజన్యం: పిక్సాబే.

వీడియో

ఆంగ్లంలో వినండి

గమనిక: ధ్యానాలు 1-10 సాధారణ పరిచయాన్ని అందించేవి: పునీత ఫౌస్టీనా డైరీకి మరియు దైవకారుణ్యానికి. ధ్యానం 11 నుండి, మనం దీనిలోని విషయాలను ధ్యానించడం ప్రారంభిస్తాం; అందుకు ఆధారంగా ఉటంకించేది డైరీని. ప్రస్తుతానికి, ఈ మొదటి 10 రోజులలో, ఏడాది పొడవునా ధ్యానించబోయే ఈ నూతన భక్తి సాధనను అర్థం చేసుకోవడానికి పునాది వేసేలా ఈ చిన్న ప్రారంభ పరిచయ ధ్యానాలను ఉపయోగించుకోండి. ఈ భక్తి సాధన దైవకారుణ్యం పట్ల భక్తిని పెంపొందించేది.

పునీత ఫౌస్టీనా దినచర్య వివిధ మార్గాలలో ఒక నూతన భక్తి విధానానికి మనలను పిలుస్తుంది.  మూడవ మార్గం దైవకారుణ్య జపమాల ద్వారా లభిస్తుంది.  ఈ జపమాల ఒక అమూల్యమైన వరం. ప్రతిరోజూ తప్పక జపించేందుకు మనం కృషి చేయవలసిన వరం ఇది. 

కృపాకారుణ్యాలను ప్రసాదించే ఈ అద్భుతమైన జపమాలను తెలుసుకొని, తరచూ జపించండి. దీని ప్రార్థనను మళ్లీ మళ్లీ జపిస్తూ, ఈ వరం ద్వారా దేవుడు మీకు ప్రసాదించదలచిన కృపనంతటినీ స్వీకరించేందుకు సుముఖంగా ఉండండి.

నిత్యపితా, మా పాపాలకు, సర్వలోక పాపాలకు పరిహారంగా, నీ ప్రియాతిప్రియ కుమారుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు దేహరక్తాలను, ఆత్మను, దైవత్వాన్ని నీకు సమర్పిస్తున్నాను. ఆయన వేదనామయమైన శ్రమల నిమిత్తం, మాపైన, సర్వలోకంపైన కరుణ చూపుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ధ్యానాలు 1-10 పరిచయాన్ని చదవండి

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు