తెలుగు

ధ్యానం 30: దేవునికి విధేయత

“ఆదాము హవ్వలను పరదైసు నుండి బహిష్కరించడం“ బెంజమిన్ వెస్ట్ చిత్రించినది

వీడియో

ఆంగ్లంలో వినండి

పవిత్రతకు ఒక కీలక మార్గం విధేయత.  ఆదాము హవ్వలు అవిధేయత వల్ల అనుగ్రహ స్థితిని కోల్పోయారు; విధేయత ద్వారా మనం తిరిగి అనుగ్రహ స్థితిని పొందుతాము.  విధేయత కష్టంగా ఉండవచ్చు; దానికి హృదయాంతరాళంలో దృఢమైన నిర్ణయం అవసరం.  యేసుకు విధేయత చూపే అవకాశాలను వెదకండి, ముఖ్యంగా అలా చేయాలని మీకు అనిపించనప్పుడు.  అవి గొప్ప అనుగ్రహానికి, హృదయ పరివర్తనకు సంబంధించిన క్షణాలు (చూడండి డైరీ #28).

ఈ రోజు వినయంతో ఉండేందుకు కృషి చేయండి.  అవిధేయతకు దారితీసే గర్వాన్ని వినయం ద్వారానే మనం చూడగలం.  గర్వం మన పాపంలో మొండిగా కొనసాగడానికీ, దేవుని అపారమైన కారుణ్యాన్ని స్వీకరించడానికి నిరాకరించడానికీ దారితీస్తుంది.  మన ప్రభువు, ఆయన ధన్యమాత అన్ని విషయాలలో తండ్రి చిత్తానికి పరిపూర్ణ విధేయత చూపినట్లే మీరు కూడా వారిని అనుసరించగలిగేలా, మీ పాపాన్ని వినయంతో ఒప్పుకోవడం గురించి, ఆ పాపం విషయమై పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగడానికి మీకున్న సంసిద్ధత గురించి ధ్యానించండి.

ప్రభువా, నీ దైవకారుణ్యం ఎదుట నన్ను నేను తగ్గించుకోవడానికి నాకు సహాయం చేయి.  నీవు నన్ను జీవించమని పిలిచే మహిమాన్వితమైన అనుగ్రహ జీవితంలోకి ప్రవేశించేలా, ఆ వినయంలో నా పాపాన్ని మాత్రమే కాక, నీవు ప్రసాదించే అనుగ్రహాన్ని, కారుణ్యాన్ని కూడా చూడటానికి నాకు సహాయం చేయి.  నీ పరిపూర్ణ ప్రేమాజ్ఞలకు నేను విధేయత చూపి, తద్వారా నీ కారుణ్యంతో నిండిపోవుదును గాక.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు