జేమ్స్ టిస్సో చిత్రించిన ‘బల్లెపు పోటు’, బ్రూక్లిన్ మ్యూజియం ద్వారా
ఆంగ్లంలో వినండి
జీవితమంతటా ఇతరుల పాపాల వల్ల మీరు గాయపడతారు. ఇది తప్పనిసరి. ఈ గాయాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారన్నదే నిజంగా ఆలోచించవలసిన ప్రశ్న. మీరు దానిని పట్టుకొని, పదేపదే తలచుకుంటూ కుమిలిపోతారా? లేక క్షమిస్తారా? అయితే క్షమించడం మాత్రమే సరిపోదు. మీరు క్షమించడం మాత్రమే కాకుండా, ఈ కారుణ్యం మీ హృదయాన్ని కనికరంతో నింపేలా దైవకారుణ్యాన్ని మీ ఆత్మలోకి ప్రవేశించనివ్వాలి. గాఢంగా ప్రేమించడానికి దేవుని కారుణ్యం మిమ్మల్ని ప్రేరేపించనివ్వాలి. మిమ్మల్ని గాయపరచినవారి కోసం మీరు ప్రార్థించే స్థితికి రావాలి; అలా చేయడం ద్వారా దేవుని కృపను వారికి పంచిపెట్టాలి. క్షమాపణ మీ హృదయం నుండి మిమ్మల్ని గాయపరచినవారి హృదయాలకు ప్రవహించనిచ్చినప్పుడు, మీరు దేవుని కారుణ్యాన్ని పంచిపెడతారు (చూడండి దినచర్య #31).
మీ పట్ల పాపం చేసినవారికి యేసు హృదయ కరుణను పంచిపెట్టాలనే మీ పిలుపును వినయంతో ధ్యానించండి. ఇది ఉన్నతమైన పిలుపు; దీనికి గాఢమైన సమర్పణ, ప్రేమ అవసరం. అయితే స్వేచ్ఛకు ఇదే ఏకైక మార్గం; దేవుని కారుణ్యం మీ సొంత ఆత్మను నింపడానికి కూడా ఇదే ఏకైక మార్గం.
ప్రభువా, నాకు అన్యాయం చేసిన వారందరినీ క్షమించాలని ఈ రోజు నేను నిశ్చయించుకుంటున్నాను. ఆ కారుణ్య కార్యం నా మనస్సును, హృదయాన్ని, ఆవేశాలను, భావాలను, నా ఆత్మలోని ప్రతి భాగాన్ని ముంచెత్తేలా సహాయం చేయుము. అందరి పట్ల నీకున్న పరిపూర్ణమైన, అపరిమితమైన ప్రేమను నేను పంచిపెట్టుదునుగాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




