ప్రార్థనలో ఉన్న పునీత పేతురు — చిత్రకారుడు: మత్తియాస్ స్టోమ్
ఆంగ్లంలో వినండి
మన నాలుక ఇతరులను బలపరచగలదు, లేదా వారిని కుంగదీయగలదు. మన నాలుక మన ఆత్మపై కూడా నేరుగా ప్రభావం చూపుతుంది. దేవుని ప్రేరణతో కూడిన మాటలను పలికినప్పుడు, మనం పవిత్రతలో ఎదుగుతాము. దేవుని నుండి రాని మాటలను పలికినప్పుడు, మన ఆత్మలకు, ఇతరులకు ఎంతో హాని చేస్తాము. మన లక్ష్యం బాహ్య మౌనం కంటే అంతరంగ మౌనమే. అంతరంగ మౌనం అంటే మాట్లాడే ముందు ఆలోచించి ప్రార్థించడం. అంటే మన అంతరంగంలో ఏకాగ్రతతో ఉండి, మన మనస్సాక్షిలో మౌనంగా, మృదువుగా మాట్లాడే దేవుని స్వరానికి అనుగుణంగా ఉండడం. సరైన సమయంలో, సరైన విధంగా ఇతరులతో కారుణ్యపు మాటలు పలకడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలంటే, దేవునిపై ఈ అంతరంగ ఏకాగ్రత అవసరం (చూడండి దినచర్య #118).
ఈ రోజు, మీ మనస్సాక్షిలో వినిపించే దేవుని స్వరానికి నిరంతరం అనుగుణంగా ఉండే వ్యక్తిగా మారడానికి ప్రయత్నించండి. దేవుని భాష నిజమైనది, మనల్ని పరివర్తన చెందించేది. ఆయన భాష మౌనంగానే అయినా స్పష్టంగా మనతో సంభాషిస్తుంది. దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉన్నారు; మీరు వింటున్నారా? ఆయన మీకు చెప్పదలచుకున్నది మాత్రమే వినగలిగేలా, ఈ రోజు మీ సొంత ఆలోచనలను, అభిప్రాయాలను నిశ్శబ్దపరచడానికి ప్రయత్నించండి.
ప్రభువా, ఈ రోజు నా మాటలను నీకు సమర్పిస్తున్నాను. నీవు పలకమని నన్ను ప్రేరేపించే మాటలను మాత్రమే నేను పలికెదను గాక. నేను వినాలని నీవు కోరుకునేది మాత్రమే వినెదను గాక. ప్రభువా, నిన్ను గాఢంగా, నిరంతర ఏకాగ్రతతో స్మరించడానికి నాకు సహాయం చేయి. నా హృదయ మౌనంలో నీ దివ్య సాన్నిధ్యాన్ని కలుసుకొని, నిన్ను, నీ కారుణ్యాన్ని ఇతరులతో పంచుకొందును గాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
ఫిబ్రవరి 17: సెర్వైట్ మఠసంఘపు ఏడుగురు పునీత వ్యవస్థాపకులు
తపస్సుకాలానికి ఉపయోగకరమైన వనరులు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు





