చిత్రం: రాబర్ట్ చేయాబ్ — పిక్సాబేలో
ఆంగ్లంలో వినండి
ఇతరులు మంచి చేసినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? ఒక చిన్నబిడ్డ మంచి చేసినప్పుడు సాధారణంగా మీ ఆత్మ ఆనందంతో నిండుతుంది. మరి ఇతరుల విషయంలో ఎలా ఉంటుంది? ఇతరులు చేసే మంచిలో హృదయపూర్వకంగా ఆనందించగలగడం కారుణ్యముగల హృదయానికి నిశ్చయమైన సూచన. తరచూ అసూయ, ఈర్ష్య ఈ రూపంలోని కారుణ్యానికి అడ్డుగా నిలుస్తాయి. అయితే, మనం మరొకరి మంచితనంలో సంతోషిస్తూ, ఎవరి జీవితంలోనైనా దేవుడు కార్యం చేస్తున్నప్పుడు ఆనందిస్తే, అది మనకు కారుణ్యముగల హృదయం ఉందనడానికి సూచన (చూడండి డైరీ #241).
మీరు ప్రశంసించడం, గౌరవించడం కష్టంగా భావించే వ్యక్తి గురించి ఆలోచించండి. మెచ్చుకోవడం, ప్రోత్సహించడం కష్టంగా అనిపించే ఆ వ్యక్తి ఎవరు? ఇలా ఎందుకు అనిపిస్తుంది? తరచూ మనం వారి పాపాన్నే కారణంగా చూపుతాం; కానీ అసలైన కారణం మన సొంత పాపమే. అది కోపం, ఈర్ష్య, అసూయ లేదా గర్వం కావచ్చు. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇతరుల సత్కార్యాలలో ఆనందించే మనస్తత్వాన్ని మనం పెంపొందించుకోవాలి. ఈ విధంగా ప్రేమించడం మీకు కష్టంగా అనిపించే కనీసం ఒక్క వ్యక్తి గురించైనా ధ్యానించి, ఈ రోజు ఆ వ్యక్తి కోసం ప్రార్థించండి. ఇతరుల ద్వారా మన ప్రభువు కార్యం చేస్తున్నప్పుడు మీరు ఆనందించగలిగేలా, కారుణ్యముగల హృదయాన్ని మీకు ప్రసాదించమని ఆయనను అడగండి.
ప్రభువా, ఇతరులలో నీ సన్నిధిని చూడటానికి నాకు సహాయం చేయుము. గర్వం, అసూయ, ఈర్ష్య అన్నిటినీ విడిచిపెట్టి, నీ కారుణ్య హృదయంతో ప్రేమించడానికి నాకు సహాయం చేయుము. ఇతరుల జీవితాల ద్వారా అనేక విధాలుగా కార్యం చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అత్యంత ఘోరమైన పాపులలో సైతం నీవు కార్యం చేయడాన్ని చూడటానికి నాకు సహాయం చేయుము. నీ సన్నిధిని నేను గుర్తిస్తున్న కొద్దీ, నిజమైన కృతజ్ఞతగా వ్యక్తమయ్యే ఆనందంతో నన్ను నింపుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
పదిహేడవ రోజు ధ్యానాలు:
ఎడారిలో 40 రోజులు & సిలువ చెంత 40 రోజులు
మార్చి 9 – రోముకు చెందిన పునీత ఫ్రాన్సెస్, సన్యాసిని
తపస్సుకాలానికి ఉపయోగకరమైన వనరులు
తపస్సుకాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




