తెలుగు

ధ్యానం 81: శక్తి మరియు కారుణ్యం

కన్యమాత పట్టాభిషేకం — చిత్రకారుడు పీటర్ పాల్ రూబెన్స్

వీడియో

ఆంగ్లంలో వినండి

సర్వాధికారం కలిగి, ఎంతో కోపం, దురుద్దేశం, ప్రతీకార స్వభావం ఉన్న ఒక దేశ నియంతను ఊహించుకోండి.  అలాంటి వ్యక్తికి కోపం తెప్పించాలని మీరు కోరుకోరు.  ఇప్పుడు దీనికి పూర్తి విరుద్ధంగా ఊహించుకోండి.  సర్వాధికారం కలిగి ఉండటంతోపాటు, నిర్మలమైన కారుణ్యంతో నిండిన హృదయంతో ఆశీర్వదించబడిన వ్యక్తిని ఊహించుకోండి.  మన దేవుడు అలాంటివాడు.  మన దేవుడు ఈ గుణాలను కలిగి ఉండటమే కాకుండా, వాటిని తన తల్లికి కూడా అందిస్తాడు.  ఆమె రాణి; గొప్ప అధికారంతో తన రాణిత్వాన్ని నిర్వహిస్తుంది.  అయితే ఆ అధికారం పరిపూర్ణ కారుణ్యంలో వ్యక్తమవుతుంది.  మన కారుణ్యమాత మధ్యవర్తిత్వం ద్వారా వెల్లడయ్యే దేవుని శక్తిపై మనం ఎల్లప్పుడూ నమ్మకం ఉంచాలి (చూడండి దినచర్య #330).

మీకు ఏ విషయంలో కారుణ్యం అవసరమో ధ్యానించండి.  అది పాపం కావచ్చు, లేదా మోయలేనంత భారంగా అనిపించే సిలువ కావచ్చు.  మిమ్మల్ని గాయపరచిన వ్యక్తిని క్షమించి, ఆ వ్యక్తిపట్ల ప్రేమ చూపించవలసిన అవసరం కావచ్చు.  అదేదైనా సరే, మన ధన్యమాత, కారుణ్యమాత వైపు తిరిగి, మీ అవసరాన్ని ఆమె మహిమాన్విత హృదయానికి అప్పగించండి.  దేవుడు ఆమెకు అప్పగించిన అధికారంతో, మీ అవసరంలో మీకు సమృద్ధిగా కృప అనుగ్రహించబడుతుంది.

అత్యంత ప్రియమైన తల్లీ, మహాశక్తిగల మాతా, పరలోక కృప నీకు అప్పగించబడింది.  రాణివైన నీకు, నీ దివ్యకుమారుడు తన కారుణ్యాన్ని పంచిపెట్టే మహిమాన్వితమైన ఆధిక్యాన్ని ఇచ్చాడు.  ప్రియమైన తల్లీ, నీ బిడ్డలమైన మేము దేవుని కారుణ్యాన్ని, మంచితనాన్ని తెలుసుకునేలా ఆ కృపను సమృద్ధిగా అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను.  మరియమాతా, మా కొరకు ప్రార్థించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

తపస్సుకాలంలోని ఐదవ ఆదివారానికి ధ్యానం:
ఎడారిలో 40 రోజులు

తపస్సుకాలానికి ఉపయోగకరమైన వనరులు

తపస్సుకాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు