తెలుగు

ధ్యానం 104: కారుణ్య జపమాల

చిత్రకర్త: Myriams-Fotos వేదిక: Pixabay

వీడియో

ఆంగ్లంలో వినండి

మన క్రైస్తవ జీవన ప్రయాణంలో ప్రార్థన అత్యవసరం.  మీరు ప్రార్థించేటప్పుడు, మీ ఆత్మలోని భావాలన్నిటినీ దేవుని ముందు కుమ్మరిస్తూ హృదయపూర్వకంగా మాట్లాడటం మంచిది.  అయితే ప్రార్థన మీ విశ్వాసానికి, దేవుని గురించి మీకు తెలిసిన సమస్తానికీ అనుగుణంగా కూడా ఉండాలి.  అది దేవుని గురించిన మీ నిజమైన జ్ఞానాన్ని ప్రతిబింబిస్తూ, ఆయన కారుణ్యాన్ని వేడుకోవాలి.  దేవుని కారుణ్యంపై మీ విశ్వాసాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబించే అటువంటి ప్రార్థనల్లో దైవకారుణ్య జపమాల ఒకటి.  (చూడండి దినచర్య #475-476).

మీరు ప్రార్థిస్తున్నారా?  ప్రతిరోజూ ప్రార్థిస్తున్నారా?  దేవుని కారుణ్యాన్ని నిరంతరం వేడుకునేలా మీ ప్రార్థన విశ్వాసం, సత్యం మీద కేంద్రీకృతమై ఉందా?  మీరు దైవకారుణ్య జపమాలను ప్రార్థించకపోతే, ఒక వారం పాటు ప్రతిరోజూ ప్రార్థించి చూడండి.  నిష్ఠగా ఉండండి; ఆ ప్రార్థనలోని మాటల్లో వెల్లడైన విశ్వాసంపై నమ్మకం ఉంచండి.  ఈ ప్రార్థనకు మిమ్మల్ని మీరు అంకితం చేసుకుంటే, దేవుని కారుణ్య ద్వారాలు తెరుచుకోవడం మీరు చూస్తారు.

నిత్యపితా, మా పాపాలకు, సర్వలోక పాపాలకు ప్రాయశ్చిత్తంగా, నీ ప్రియాతిప్రియ కుమారుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును నీకు సమర్పిస్తున్నాను.  ఆయన అనుభవించిన దుఃఖభరితమైన శ్రమల నిమిత్తము, మాపైనా సర్వలోకము పైనా కరుణ చూపుము.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

పాస్కా కాల ప్రార్థనలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు