తెలుగు

ధ్యానం 113: నిత్య పితకు ఒక సమర్పణ

లూకా కాంబియాసో, CC0, వికీమీడియా కామన్స్ ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

మనం చేయగల అత్యున్నత ప్రార్థన “సమర్పణ ప్రార్థన.” సమర్పణ ప్రార్థన అనేది సిలువపై క్రీస్తు చేసిన ఏకైక బల్యర్పణతో ఐక్యమై తండ్రికి అర్పించే బలి. మనంతట మనమే మనల్ని అర్పించుకోము. క్రీస్తు యేసుతో ఐక్యమై మనల్ని అర్పించుకుంటాము. మరింత నిర్దిష్టంగా చెప్పాలంటే, మన ప్రార్థనలను, ఉపవాసాన్ని, ఇంద్రియనిగ్రహాన్ని, దైనందిన పనిని దేవునికి అర్పించాలి. ప్రతిరోజూ ప్రార్థనలు చేయండి. ఉపవాసం, ఇతర విధాలైన స్వీయనిగ్రహం ద్వారా మీ శారీరక వాంఛలను క్రమం తప్పకుండా అదుపులో ఉంచండి. మీ దైనందిన పనులన్నిటినీ దేవునికి కానుకగా, ప్రతిరోజూ ఆయన చిత్తానికి అనుగుణంగా చేయండి. వీటన్నిటినీ కుమారునితో కలిసి తండ్రికి అర్పించండి. అప్పుడు దేవుడు మీ సమర్పణను నిర్మలమైన, పవిత్రమైన బలిగా స్వీకరిస్తారు (చూడండి డైరీ #531).

మీరు ప్రార్థించేటప్పుడు, మీ ప్రార్థనను ఒక సమర్పణగా చేస్తున్నారా? మనం తరచుగా ఈ అవసరమో ఆ అవసరమో తీర్చమని ప్రార్థించి, అక్కడితో ఆగిపోతాం. మన అవసరాలను దేవుని ముందు ఉంచడం మంచిదే. మనం వాటిని ఆయన ముందు ఉంచకముందే ఆయనకు మన అవసరాలు తెలుసు. అయినా, మన నిర్దిష్ట అవసరాలను తీర్చమని మనం ఆయనను అడగాలని ఆయన కోరుకుంటారు. కానీ మీ ప్రార్థనలో అక్కడితో ఆగిపోకండి. మీరు మరింత ముందుకు సాగాలని ప్రభువు కోరుకుంటున్నారు. మీ నుంచి ఆయన త్యాగాన్ని కోరుకుంటున్నారు. మీ ప్రార్థన దేవునికి నిత్య త్యాగార్పణగా మారుతుందో లేదో ధ్యానించండి. త్యాగార్పణ అనే ఈ భావన మీ రోజువారీ ఆలోచనల్లో భాగం కాకపోతే, దానిని భాగం చేసుకోవడం ప్రారంభించండి. మీ దైనందిన జీవితంలోనూ ప్రార్థనలోనూ త్యాగభావంతో ఆలోచించండి, ప్రవర్తించండి. అప్పుడు ప్రభువు మీ త్యాగార్పణను స్వీకరించి, మీ పవిత్రత కోసమూ కతోలిక సభ అంతటి పవిత్రత కోసమూ దానిని శక్తివంతంగా ఉపయోగిస్తారు.

ప్రభువా, నీవు నీ జీవితాన్ని పరిపూర్ణ బలిగా తండ్రికి అర్పించడమే కాకుండా, నిజమైన ప్రార్థనకు పరిపూర్ణ మాదిరిని కూడా నాకు చూపించావు. ఈ త్యాగార్పణ ద్వారా నీవు నన్ను పవిత్రపరచి, నీ కతోలిక సభకు మరింత పవిత్రతను చేకూర్చేలా, నా జీవితాన్ని ప్రతిరోజూ నీకు బలిగా అర్పించడానికి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ఏప్రిల్ 23 – పునీత జార్జి, వేదసాక్షి

పునీత అడల్బర్ట్, బిషప్పు మరియు వేదసాక్షి

పాస్కా కాల ప్రార్థనలు

పాస్కా కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు


ఈ-పుస్తకంగా, కాగితపు అట్టతో ముద్రిత పుస్తకంగా లభిస్తుంది:

అమెజాన్ –  బార్న్స్ అండ్ నోబుల్ – గూగుల్ ప్లే – ఐట్యూన్స్

దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు:
పునీత ఫౌస్తీనాతో 365 రోజులు