తెలుగు

ధ్యానం 124: మధ్యస్థ ప్రార్థన ద్వారా లభించే కారుణ్యం

జాషువా రెనాల్డ్స్ చిత్రించిన ప్రార్థనలో శిశువైన సమూయేలు

వీడియో

ఆంగ్లంలో వినండి

దేవుని దైవకారుణ్యం లోకంపై సమృద్ధిగా ప్రవహించడాన్ని మీరు చూడాలనుకుంటున్నారా?  ఆ ప్రశ్నకు మీరు తడుముకోకుండా “అవును” అని జవాబిస్తారని ఆశిస్తున్నాము, భావిస్తున్నాము.  అది జరుగుతుందా లేదా అనే విషయంలో కొంతవరకు మీకూ బాధ్యత ఉందని తెలుసుకోవడం ముఖ్యం.  ప్రత్యేకంగా, మీరు ఇతరుల కోసం చేసే మధ్యస్థ ప్రార్థనకు ప్రత్యక్ష ఫలితంగా తన అపార కారుణ్యం ప్రవహించాలని యేసు నిర్ణయించుకున్నారు.  ఇది నిజం.  ఇతరుల కోసం ప్రార్థించాలని మీరు వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయానికి ప్రత్యక్ష ఫలితంగా యేసు వారికి ప్రత్యేక కృపలను అనుగ్రహిస్తారు.  ఆయన ఇతర మార్గాలలో అనుగ్రహించే ఎన్నో కృపలకు అదనంగా ఇతరులకు అందించే కృప ఇది.  మీ వంతు బాధ్యతను నెరవేర్చండి; ఇతరులు సమృద్ధిగా ఆశీర్వాదాలు పొందుతారు.  మీ వంతు బాధ్యతను నిర్లక్ష్యం చేస్తే, మీ ప్రార్థనల ద్వారా మీరు వారికి సంపాదించిపెట్టగలిగిన ఆ ప్రత్యేక కృపను వారు పొందరు (చూడండి డైరీ #599).

ఈ రోజు, మీ మధ్యస్థ ప్రార్థనకు దేవుడు అప్పగించిన వ్యక్తి లేదా వ్యక్తుల గురించి ధ్యానించండి.  ఇది చిన్న బాధ్యత కాదు.  ఈ పని కోసం దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు.  మీ ప్రార్థనల ద్వారా ఇతరులు ఆశీర్వాదాలు పొందుతారు.  మీ ప్రార్థనల ద్వారా దేవుడు ఎవరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు?  వారి కోసం ప్రార్థించాలని దృఢమైన నిర్ణయం తీసుకోండి; మీ ప్రార్థనల ప్రత్యక్ష ఫలితంగా ప్రభువు కారుణ్యం వారిపై కురుస్తుందని నమ్మకం ఉంచండి.

ప్రభువా, నేను ఎవరి కోసం ప్రార్థించాలని నీవు కోరుకుంటున్నావో నాకు చూపించమని వేడుకుంటున్నాను.  ఈ కోరికను నా హృదయంలో ఉంచు.  నా మధ్యస్థ ప్రార్థనలో నమ్మకంగా నిలవడానికి, ఆ ప్రార్థన శక్తిపై నమ్మకం ఉంచడానికి నాకు సహాయం చేయి.  ఇక్కడ, ఈ క్షణమే (ఒక వ్యక్తిని మనసులో తలచుకోండి) నీకు సమర్పిస్తున్నాను.  ముఖ్యంగా, నీ తల్లి పరిపూర్ణ ప్రార్థనల కోసం ఈ వ్యక్తిని ఆమె విమల హృదయానికి సమర్పిస్తున్నాను.  మరియమాతా, మా కొరకు ప్రార్థించు.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

పాస్కా కాల ప్రార్థనలు

పాస్కా కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు


మీరు నన్ను అనుమతిస్తే నేను మీ జీవితంలోకి ప్రవేశించగలను
ఆధ్యాత్మిక ధ్యానాలు