బిడ్డకు ప్రార్థన నేర్పుతున్న స్త్రీతో కూడిన గది దృశ్యం — పియర్ ఎడ్వార్డ్ ఫ్రేర్
ఆంగ్లంలో వినండి
చిన్నపిల్లలు ఎప్పుడెప్పుడు పెద్దవారమవుతామా అని ఆతురపడుతుంటారు. పుట్టినరోజు వచ్చినప్పుడు, తమకు మరో సంవత్సరం వయసు పెరిగిందని ఆనందంతో నిండిపోతారు. అయినప్పటికీ, చిన్నపిల్లలుగా వారు ఇంకా ఎన్నో విధాలుగా తమ తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటారు. ఆధ్యాత్మికంగా మన విషయంలోనూ ఇదే నిజం. మనం కూడా తరచుగా “పెద్దవారమై”, దేవుని కోసం గొప్ప కార్యాలు సాధిస్తూ గొప్ప పునీతులుగా మారాలని కోరుకుంటాం. అయినప్పటికీ, మనం ఇంకా చిన్నపిల్లలమేనని తరచుగా గుర్తుచేసుకోవాలి. దేవుని ఎదుట మన “చిన్నతనంలో”, మన అవసరాలన్నింటికీ ఇప్పుడూ ఎప్పటికీ పూర్తిగా ఆయనపైనే ఆధారపడి ఉంటాం. గొప్ప పునీతులుగా మారడానికి, పవిత్రతలో ఎదగడానికి ఈ సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. చిన్నవారిగా మారడం ద్వారానే మనం గొప్పవారమవుతాం (చూడండి డైరీ #779).
దేవుని ఎదుట మీ చిన్నతనాన్ని ధ్యానించండి. సర్వశక్తిమంతుని మహిమతో, శక్తితో పోలిస్తే మనం చిన్నవాళ్లం, బలహీనులం. కానీ దేవుడు మన చిన్నతనాన్ని చూస్తాడు; మనం సంపూర్ణ నమ్మకంతో తనవద్దకు పరుగెత్తి రావాలని కోరుకుంటాడు. మిమ్మల్ని మీరు ఆయన కారుణ్యానికి అప్పగించుకొని, ఆయనవద్దకు పరుగెత్తండి. మీరు పూర్తిగా ఆయనపై ఆధారపడి ఉన్నారని వినయంతో అంగీకరించడం ద్వారానే, ఆయన ఆలింగనంలో బలాన్ని పొందుతారని గ్రహించండి.
ప్రభువా, నా అవసరంలో నేను నీవద్దకే పరుగెత్తి వచ్చి, నిన్నే గట్టిగా హత్తుకుంటున్నాను. నీవు సర్వశక్తిమంతుడవు, కొలతలేనంత మహిమగలవాడవు. అన్ని విషయాలలో నేను నీపైనే ఆధారపడి, నా సర్వస్వంతో నిన్ను నిరంతరం వెదకుదును గాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
జూన్ 2 – వేదసాక్షులైన పునీతులు మార్సెల్లినుస్ మరియు పేతురు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




